telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కొడుకుతో సమీరా రెడ్డి ‘సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్’ వీడియో

sameerareddy

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘నరసింహుడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సమీరా ఆ తరవాత చిరంజీవితో ‘జై చిరంజీవ’, ‘అశోక్’ సినిమాలో నటించారు. ఈమె తెలుగమ్మాయే అయినప్పటికీ కుటుంబం ముంబైలో స్థిరపడటంతో అక్కడే పెరిగారు. ‘సూర్య సన్ ఆఫ్ కృష్ణన్’తో తమిళ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ముంబైకి చెందిన వ్యాపారవేత్త అక్షయ్ వార్దేను 2014లో పెళ్లి చేసుకున్న తరవాత సమీరారెడ్డి సినిమాల నుంచి పూర్తిగా తప్పుకున్నారు. భర్తతో కలిసి బిజినెస్‌ వ్యవహారాల్లో పాలుపంచుకుంటున్నారు. 2015లో సమీరారెడ్డి దంపతులకు బాబు పుట్టాడు. కిందటేడాది జూలైలో పాపకు సమీరా జన్మనిచ్చారు. సమీరారెడ్డి సినిమాలకు దూరమైనప్పటికీ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటున్నారు. ఇది ఇలా ఉంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన విధంగా సేఫ్ హ్యాండ్స్ కార్యక్రమంపై సోషల్ మీడియా ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు సినీ నటులు. ఈ కార్యక్రమంలో ఇప్పుడు సమీరారెడ్డి పాల్గొ్న్నారు. తన కుమారుడుతో కలిసి సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్ చేసి చూపించారు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.

Related posts