telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు

మహిళలకు షాక్‌… భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

బులియన్‌ మార్కెట్‌లో వారం రోజులుగా తగ్గిన బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే తాజాగా అటు ఢిల్లీ, ఇటు హైదరాబాద్‌లోనూ బంగారం, వెండి ధరలు బాగా పడిపోయాయి. ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర మాత్రం రూ.220 పెరిగి రూ. 48,380 పలుకుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.200 పెరిగి రూ. 44,350 వద్ద ఉంది. హైదరాబాద్ విషయానికి వస్తే.. బంగారం ధరలు ఇవాళ స్థిరంగా రికార్డు అయ్యాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 210పైకి ఎగసి రూ. 46,040 కు చేరగా… అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 190 పెరిగి రూ. 42,200 పలుకుతోంది. బంగారం బాటలోనే, వెండి ధరలు కూడా భారీగానే పెరిగాయి. కిలో వెండి ధర రూ.900 పెరిగి రూ.72,500 వద్ద కొనసాగుతోంది.

Related posts