ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న హీరోలలో రెబల్ స్టార్ ప్రభాస్ ఉన్న సంగతి తెలిసిందే. వాటిలో బాలీవుడ్ స్టార్ దర్శకుడు ఓం రౌత్‌తో చేయనున్న ఆదిపురుష్ కూడా ఒకటి. అయితే ప్రస్తుతం ప్రభాస్ వేరే సినిమాతో బిజీగా ఉండటంతో ప్రభాస్ లేకుండానే ఓంరౌత్ ఆదిపురుష్‌ను మొదలు చేయనున్నాడు. దీనికి సంబంధించిన చిత్రీకరణ పనులను కూడా మొదలుపెట్టేశాడు. ప్రభాస్ లేనటువంటి సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. ఇందులో ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్న బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ పాల్గొననున్నాడు. దీంతో అతి త్వరలో ఆదిపురుష్ చిత్రీకరణను ప్రారంభించనుంది. అయితే ప్రభాస్ చేస్తున్న ఆదిపురుష్ సినిమా రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్నాడని, బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రను పోషించనున్నాడు. ప్యాన్ ఇండియా ఫిల్మ్ గా పలు భాషల్లో తెరకెక్కనున్న ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు పలువురి పేర్లు వినిపించినా ఇప్పటి వరకూ ఎవరినీ ఫైనలైజ్ చేయలేదు. అయితే తాజాగా శ్రీరాముని తల్లి కౌసల్య పాత్ర కోసం హేమమాలినిని సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల గౌతమీపుత్రశాతకర్ణిలో శాతకర్ణి తల్లి గౌతమిగా నటించి ఆ పాత్రకు వన్నె తెచ్చిన హేమమాలిని అయితే కౌసల్య పాత్రకు న్యాయం జరుగుతుందనే ఆలోచనతో ఆమెను అప్రోచ్ అయ్యాడట ఓం రౌత్. హేమమాలిని కూడా అందుకు ఒప్పుకునే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మరి ఈ విషయాన్ని అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారో చూద్దాం.
previous post