telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నారా రోహిత్ సర్ప్రైజ్ లుక్

Nara-rohit

తొలి సినిమా ‘బాణం’తోనే నటుడిగా మంచి మార్కులు కొట్టేసాడు యంగ్ హీరో నారా రోహిత్. ఈ హీరో హిట్ అనే మాట విని చాలా కాలమే అవుతోంది. శ్రీవిష్ణుతో కలిసి నారా రోహిత్ నటించిన చిత్రం ‘వీరభోగ వసంతరాయలు’, ఆ తర్వాత మరో మల్టీస్టారర్ ‘శమంతకమణి’ సినిమాల రిజల్ట్ కూడా నిరాశపరిచింది. ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా ఇంటి పట్టునే ఉంటున్నాడు. తాజాగా నారా రోహిత్ న్యూ లుక్ తో ప్రత్యక్షమయ్యాడు. బరువును తగ్గించి స్మార్ట్ లుక్ కి మారాడు. ఈసారి భారీ బడ్జెట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావాలని చూస్తున్నాడు రోహిత్. గుబురు గడ్డంతో కొత్త లుక్ లో రోహిత్ అదిరిపోయాడనే చెప్పాలి. ఇక అల్లు అర్జున్ నటిస్తున్న “పుష్ప” లో రోహిత్ నటిస్తున్నాడని గతకొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై ఇంతవరకు క్లారిటీ రాలేదు. మరి రోహిత్ న్యూ లుక్ పుష్ప కోసమా లేక వేరే సినిమా కోసమో చూడాలి. ఇక మధ్యలో రోహిత్ కూడా కొన్ని కమర్షియల్ ఫార్మాట్ చిత్రాలు చేసి చేతులు కాల్చుకున్నాడు.

Related posts