telugu navyamedia
సినిమా వార్తలు

గని మూవీ కొత్త రిలీజ్‌ డేట్ విడుద‌ల‌..

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న చిత్రం గ‌ని. వరుణ్‌ తేజ్‌ బాక్సార్‌గా కనిపించనున్న ఈ మూవీకి కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వం వహించాడు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ సయూ మంజ్రేకర్‌ హీరోయిన్‌గా నటిస్తుంది.

ఫిబ్రవరి 25న ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా భీమ్లా నాయక్‌ రిలీజ్‌ నేపథ్యంలో గని చిత్రాన్ని వాయిదా వేశారు చిత్ర బృందం ప్రకటించింది.ఇప్పుడు కొత్త తేదీని ప్రకటిస్తూ సోషల్ మీడియాలో తాజాగా అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఏప్రిల్‌ 8న మూవీని విడుదల చేస్తున్నట్లు గీతా ఆర్ట్స్‌ తమ అధికారికరంగా వెల్లడించింది.

అల్లు అరవింద్‌ సమర్పణలో సిద్దు ముద్ద, అల్లు బాబీలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్‌ అయిన ఈ చిత్రం టీజర్‌, పాటలకు మంచి రెస్పాన్స్‌ వస్తోంది.

ఇందులో సునీల్‌ శెట్టి, ఉపేంద్ర, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. మిల్కీ బ్యూటీ తమన్నా ఓ స్పెషల్ సాంగ్‌లో సందడి చేయనుంది. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. 

Related posts