telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నెపోటిజంపై అదాశర్మ కామెంట్స్

Adah Sharma

టాలీవుడ్ లో ‘హార్ట్ ఎటాక్’ సినిమాతో హీరోయిన్‌గా మంచి గుర్తింపు సంపాదించుకుంది అదాశర్మ. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా ఫరవాలేదనిపించిన ఈ బ్యూటీకి మాత్రం పెద్దగా గుర్తింపు రాలేదు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ హాట్ హాట్ విన్యాసాలతో ఫోటో షూట్‌లు చేస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. ప్రస్తుతం తెలుగులో ఓ సినిమా చేస్తుంది ఈ చిన్నది. ప్రస్తుతం ఈ బ్యూటీ హైదరాబాద్ లో ఉంటుంది. తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ నెపోటిజం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. “నేను కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి అంతా నన్ను ఇదే ప్రశ్న అడుగుతున్నారు. దానికి నేను మనలో టాలెంట్ వుంటే ఖచ్చితంగా పైకి వస్తారు అని సమాధానం చెప్పేదాన్ని.. కానీ మనసులో మాత్రం ఎంత టాలెంట్ వున్నా సరైన అవకాశం దొరకనప్పుడు ప్రతిభకు గుర్తింపు రాదు కదా ?అని నేను మనసులో అనుకుండేదాన్ని. అయినా పాజిటివ్ గా ఉండటం, అందరిని నవ్వించచడం నేర్చుకున్నా అని చెప్పుకొచ్చింది. అవకాశాలు రాలేదా ఓకే లీవిట్ అనుకుంటూ .. ముందుకు సాగడం నేర్చుకున్నాను. ఏం జరుగుతుందో చూడాలని నిర్ణయించుకున్నాను” అంటూ చెప్పుకొచ్చింది.

Related posts