telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

మెరిగిన ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్స్‌.. ఇండియా టార్గెట్‌ ఎంతంటే?

మొతేరా స్టేడియంలో జరుగుతున్న రెండో టీ-20లో ఇండియా ఘోరంగా విఫలమైంది. ఇంగ్లండ్‌ జట్టు మెరుగైన ఆటతీరును ప్రదర్శించింది. ఇండియా బౌలర్లను ధీటుగా ఎదుర్కొని మంచి స్కోర్‌ను సాధించింది. ముఖ్యంగా ఓపెనర్‌ రాయ్‌, మిడిల్‌ ఆర్డర్‌ రాణించడంతో.. నిర్ణీత ఓవర్లలో 164 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్లలో బట్లర్‌ 0, డేవిడ్‌ మిలాన్‌ 24, బేయిర్‌ స్రో 20, కెప్టెన్‌ మోర్గాన్‌ 28, ఆల్‌ రౌండర్‌ స్టోక్స్‌ 24 పరుగులు చేశారు. అటు ఓపెనర్‌ జాసేన్‌ రాయ్‌ ఒక్కడే అందరి కంటే ఎక్కువ పరుగులు చేశారు. రాయ్‌ 46 పరుగులు చేసి… సుందర్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. రాయ్‌ రాణించడంతో ఇంగ్లండ్‌ టీం గౌరవప్రదమైన స్కోర్‌ చేయగలిగింది. ఇక సుందర్‌ 2 వికెట్లు, షార్దుల్‌ 2 వికెట్లు తీశారు. కాగా.. మొదట టాస్‌ గెలిచి ఇండియా టీం బౌలింగ్‌ ఎంచుకుంది. దీంతో ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ చేసింది.

 

Related posts