కోలివుడ్ కి చెందిన ప్రముఖ నటుడు పార్తిబన్ ఇప్పుడు మర్డర్ కేసులో ఇరుక్కున్నాడు. ఎన్నో తమిళ చిత్రాల్లో నటించిన ఈయన అప్పట్లో ఒకట్రెండు తెలుగు సినిమాల్లో కూడా నటించారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్టార్ హీరోల చిత్రాల్లో నటిస్తోన్న పార్తిబన్ పేరు ఇప్పుడు హత్య కేసులో వినిపించడం కోలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. చెన్నైలో పార్తిబన్ పై జయరాం అనే వ్యక్తి హత్యాయత్నం కేసును పెట్టారు. ఈ కేసులో ఈ సీనియర్ నటుడిని పోలీసులు విచారిస్తున్నారు.
అసలేం జరిగిందంటే… గత పదేళ్లుగా పార్తిబన్ దగ్గర జయరాం అనే వ్యక్తి పని చేస్తున్నాడు. తాజాగా పార్తిబన్ ఇంట్లో దొంగతనం జరిగింది. దాంతో పార్తిబన్ కొందరిపై సీరియస్ అయ్యాడు. ఆ సమయంలో అతడు జయరాం ని కొట్టాడట. దాంతో అతడు మూడో ఫ్లోర్ నుండి పడ్డాడట. ఈ ప్రమాదంలో అతడికి గాయాలయ్యాయట. దీంతో అతడు పోలీసులకు పార్తిబన్ పై ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై స్పందించిన పార్తిబన్ అందులో నిజం లేదని అన్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని అంటున్నాడు. ఎవరో కావాలనే తనను ఇరికిస్తున్నారని అన్నారు.
పవన్ కల్యాణ్ అంటే నాకు ప్రాణం.. స్వామి భక్తిని చాటుకున్న బండ్ల గణేశ్