బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత అనూహ్యంగా తెరపైకి వచ్చిన డ్రగ్స్ కోసం బాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. రియాకు డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్నాయని తెలియడంతో రంగంలోకి దిగిన నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) లోతుగా విచారణ చేపడుతోంది. ఇప్పటికే దీపికా పదుకొనే, సారా అలీఖాన్, శ్రద్ధా కపూర్‌తో పాటు టాలీవుడ్ హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్‌కు నోటీసులు అందాయి. వీరితోపాటు దీపికా మేనేజర్ కరిష్మా, డిజైనర్ సిమోన్ ఖంబట్టా, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మేనేజర్ శ్రుతి మోదీలను కూడా ప్రశ్నించడానికి పిలిచింది. రోజు (సెప్టెంబర్ 24) శ్రుతి మోడీ, సిమోన్ ఖంబట్టా, రకుల్ ప్రీత్‌లు ఎన్‌సీబీ దర్యాప్తుకు హాజరుకావాల్సి ఉంది. దీపికా పదుకొనేను సెప్టెంబర్ 25 (శుక్రవారం)న, సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్లను సెప్టెంబర్ 26 (శనివారం) దర్యాప్తుకు హాజరు కావాల్సిందిగా అధికారులు ఆదేశించారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ హీరోయిన్ షెర్లిన్ చోప్రా సోషల్ మీడియా ద్వారా క్వాన్ ట్యాలెంట్ ఏజెన్సీ అధినేతపై సంచలన ఆరోపణలు చేసింది. క్వాన్ ట్యాలెంట్ ఏజెన్సీ సహ భాగస్వామి అనిర్భన్ తన వక్షోజాల గురించి అసభ్యంగా మాట్లాడాడని తెలిపింది. “సినిమా అవకాశాల కోసం అనిర్భన్‌ను కలిశాను. అతను నన్ను పై నుంచి కింద వరకు చూశాడు. ‘ఏమైంది సర్.. నా డ్రెస్ బాగోలేదా’ అని అడిగాను. ‘కాదు.. నీ వక్షోజాలు నిజమైనవేనా? వాటిని ముట్టుకోవచ్చా’ అని అడిగాడు. నేను షాకయ్యాను. అవి నిజమైనవైనా, కాకపోయినా అతనికేంటి సమస్య? ఓ మహిళతో అలా మాట్లాడకూడదు” అని షెర్లిన్ పోస్ట్ చేసింది.
Last year, I had spoken about Anirban, founder of Kwan Talent Agency.
Damn these druggie A-listers with downmarket values!
He had the audacity to ask me if my breasts were real or not! What difference does it make? He wanted to touch them to feel if they were real!! Bloody pimp! https://t.co/LcFHhNYXPz pic.twitter.com/EfqbRNH61p— Sherni (@SherlynChopra) September 22, 2020