telugu navyamedia
సినిమా వార్తలు

హీరో ‘నవదీప్’ సమర్పణలో ‘సగిలేటికథ’ మూవీ ‘ప్రీమియర్ షో’ కి అద్భుతమైన రెస్పాన్స్.

రవి మహాదాస్యం(Ravi Mahadasyam), విషిక లక్ష్మణ్‌(Vishika Laxman) జంటగా నటిస్తున్న చిత్రం ‘సగిలేటి కథ(Sagiletikatha)’. రాయలసీమ పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి రాజశేఖర్‌ సుద్మూన్‌ దర్శకత్వం వహించారు. హీరో నవదీప్‌ సి-స్పేస్ సమర్పణలో, షేడ్‌ ఎంటర్టైన్మెంట్‌, అశోక్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌లో దేవీప్రసాద్‌ బలివాడ, అశోక్‌ మిట్టపల్లి సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే రిలీజ్ అయ్యిన ట్రైలర్, సాంగ్స్ కి ప్రేక్షకుల నుండి అశేష ఆధరణ లభించింది. ఈ బుధవారం, హీరో నవదీప్ ఆధ్వర్యంలో ‘ప్రీమియర్ షో’ సక్సెస్ ఫుల్ గా తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ ల మధ్య సందడి గా ఈవెంట్ సాగింది.

ఈ చిత్రం ‘ప్రీమియర్ షో’ తరువాత చిత్ర యూనిట్…

హీరో నవదీప్(ప్రెజెంట్స్) మాట్లాడుతూ: ప్రతి ఒక్కరి జీవితంలో లైఫ్ జర్నీ అనేది సాఫీగా సాగదు. ప్రతి వ్యక్తి కింద నుంచి పైకి రావాలిసిందే. అలా పైకి వెళ్లిన వ్యక్తులు, కింద నుంచి పైకి రావాలి అనుకునే వాళ్ళని చెయ్యి అందిందామని ఆలోచనతో తీసుకున్న ఈ నిర్ణయమే ‘సగిలేటి కథ’ సినిమా. టీమ్ అందరు చాలా కసి గా పని చేసారు. చాలా టాలెంట్ ఉన్న టీం మా చిత్రం తో పరిచయమైనందుకు నాకు చాలా కిక్ ని ఇచ్చింది. ఈ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుందని నమ్ముతున్నాను థ్యాంక్ యు..!!

డైరెక్టర్ రాజశేఖర్ సుద్మూన్: నేను తొమ్మిది సంవత్సరాలు నుంచి సినిమా ఫీల్డ్ లో ఉన్నాను. కేరీర్ మొదట్లో సినిమాకి వెళ్తాను అని తోటి వ్యక్తులకి చెప్పగానే, అడ్రస్ లేకుండా పోతావ్ అన్నారు. ఇప్పుడు చెప్తున్నాను, నా అడ్రస్ సి స్పెస్, పిన్ కోడ్ నవదీప్. ఈ సినిమా ఈ రేంజ్ కి రావడం కేవలం నవదీప్. నేను చేసిన ఈ సినిమా జర్నీ మొత్తం లో మొదటి నుంచి నాకు సపోర్ట్ గా నిలిచిన వ్యక్తి మా హీరో రవి మహాదాస్యం. ఈ సినిమా సక్సెస్ అయ్యితే ఫిఫ్టీ పర్సెంట్ క్రెడిట్ మా హీరో కి దక్కుతుంది. ఫెయిల్ అయ్యితే, అది నాకు దక్కుతుంది….!! థ్యాంక్ యు..!!

ప్రొడ్యూజర్ దేవీప్రసాద్ మాట్లాడుతూ: మా చిత్రం ‘చిన్న మూవీ’ అనే పిలుపు తో స్టార్ట్ అయ్యి, ‘పెద్ద మూవీ’ అని గర్వంగా చెప్పుకునే విధంగా చేసింది. ఒకే ఒక వ్యక్తి, సి స్పెస్ ఫౌండర్ హీరో నవదీప్. మా సినిమా ఎండింగ్ లో పార్ట్ 2 అని పెట్టడానికి కారణం, సినిమా హిట్ అని బలంగా నమ్మడం. రాయలసీమ బ్యాక్డ్రాప్ లో తీసిన ఈ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుందని ఆశిస్తున్నాను.

హీరో రవి మహాదాస్యం మాట్లాడుతూ: సినిమా మొదలు పెట్టిన రోజు నుంచి ఇప్పటి వరుకు నేను వింటున్న విషయం కొత్త…కొత్త…అవ్వును!! మేమందరం కొత్త కావచ్చు. కానీ, కొత్త కంటెంట్ తో వస్తున్నాం. మా సినిమా కంటెంట్ ప్రతి ఒక్కరికి నచ్చుతుందని బలంగా నమ్ముతున్నాను. ఇకపోతే, ఈ సినిమాకి ప్రధాన బలం ‘నవదీప్’ గారు ఆయనికి నేను రుణపడి ఉంటాను. ఈ సినిమా రాయలసీమ బ్యాక్డ్రాప్ లో అన్ని రకాల ఎమోషన్స్ ని పండించాం. ఇంటర్వెల్ లో చాల మంది తెలుగు జర్నలిస్ట్ లు పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు. ప్రతి ప్రేక్షకుడికి నచ్చుతుందని మా టీం నమ్మకం.

హీరోయిన్ విషిక లక్ష్మణ్ మాట్లాడుతూ: నాకు చాలా హ్యాపీ గా ఉంది, ఈ సినిమా లో యాక్ట్ చేయడం. రియల్ లైఫ్ లో నేను చేసిన కృష్ణమ్మా క్యారెక్టర్ చాలా దగ్గర గా ఉంటుంది. మా సినిమా ఈ స్థాయిలో రావడానికి ముఖ్య కారణం నవదీప్ గారు. అలాగే, నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ కి నా కృతజ్ఞతలు.

ప్రొడ్యూజర్ అశోక్ మాట్లాడుతూ: ఈ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుందని కోరుకుంటున్నాను. ఎవ్వరికైనా మా సినిమా నచ్చితే, మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ కి చెప్పండి అలా అందరికి సర్క్యులేట్ చేయండి. ఆ విధంగా ఒక మంచి సినిమా ప్రేక్షకుడికి చేరుతుందని అనుకుంటున్నాను.

నటీనటులు: రవి మహాదాస్యం, విషిక లక్ష్మణ్, నరసింహా ప్రసాద్ పంతగాని
రచన, దర్శకత్వం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్: రాజశేఖర్ సుడ్మూన్
కో-రైటర్: శశికాంత్ బిల్లపాటి, మని ప్రసాద్ అరకుల
నిర్మాతలు: అశోక్ మిట్టపల్లి, దేవీప్రసాద్ బలివాడ
ఇన్ అసోసియేషన్ విత్: సి స్పెస్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నరేష్ మాదినేని
అసోసియేట్ ప్రొడ్యూసర్: పుష్పాభాస్కర్, సునీల్ కుమార్ ఆనందన్, లీలా కృష్ణ కొండేపాటిh
సంగీతం: జశ్వంత్ పసుపులేటి
నేపథ్యసంగీతం: సనల్ వాసుదేవ్
సింగర్స్: కీర్తన శేష్, కనకవ్వ
సాహిత్యం: వరికుప్పల యాదగిరి, పవన్ కుందాని, రాజశేఖర్ సుడ్మూన్, శశికాంత్ బిల్లపాటి, జశ్వంత్ పసుపులేటి
పి.ఆర్.ఓ: తిరుమలశెట్టి వెంకటేష్
ఆర్ట్ డైరెక్టర్స్: హేమంత్ జి, ఐశ్వర్య కులకర్ణి
కాస్ట్యూమ్ డిజైనర్: హర్షాంజలి శేనికేషి
సౌండ్ డిజైనర్: యతి రాజు
సౌండ్ మిక్సింగ్: శ్యామల సిక్దర్
డి.ఐ: కొందూరు దీపక్ రాజు
పబ్లిసిటీ డిజైనర్: యమ్.కే.యస్ మనోజ్

Related posts