telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఎన్టీఆర్ పుట్టినరోజున 31వ సినిమా ప్రకటన ?

NTR

యంగ్ టైగర్ ఎన్టీఆర్. ప్రస్తుతం తన 29వ సినిమాగా RRR చేస్తున్న ఆయన 30వ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో చేసేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అందుకు సంబంధించిన సన్నాహాలు జరిగిపోతున్నాయి. ఈ నెల 20వ తేదీన ఎన్టీఆర్ పుట్టినరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, ‘ఆర్ ఆర్ ఆర్’ నుంచి ఎన్టీఆర్ పాత్రకి సంబంధించిన ఒక స్పెషల్ వీడియోను వదలనున్నట్టు తెలుస్తోంది. ఇక త్రివిక్రమ్ కూడా ఎన్టీఆర్ తో చేయనున్న ‘అయినను పోయిరావలె హస్తినకు’ సినిమాకి సంబంధించిన టైటిల్ పోస్టర్ ను వదిలే అవకాశం కనిపిస్తోంది. త్రివిక్రమ్ సినిమా తరువాత ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో కలిసి ఎన్టీఆర్ సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. 150 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా నిర్మితం కానున్నట్టుగా సమాచారం. ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రకటన కూడా ఆ రోజున వెలువడే అవకాశం ఉందని అంటున్నారు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ కథలో ఎన్టీఆర్ మాస్ లుక్ తో కనిపించనున్నాడని చెబుతున్నారు. 2021 చివరి నెలల్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి 2023లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారట. అంతేకాదు ఈ మూవీ కోసం ఎన్టీఆర్ రెండేళ్ల పాటు డేట్స్ ఇవ్వనున్నట్టు సమాచారం. భారీ బడ్జెట్, భారీ తారాగణంతో గత రికార్డులు తిరగరాసేలా హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్‌తో ఈ సినిమా రూపొందించనున్నారని తెలుస్తోంది.

Related posts