telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ విద్యా వార్తలు

ఎన్నికలలో వెబ్ కాస్టింగ్ .. ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోగలరు.. !

web casting jobs for loksabha elections

రాష్ట్ర ఎన్నికల కమిషన్ లోక్‌సభ ఎన్నికల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహించాలని నిర్ణయించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ విధానంతో సత్ఫలితాలు రావడంతో లోక్‌సభ ఎన్నికలోనూ అమలు చేయాలని నిర్ణయించింది. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలోని కనీసం 10 శాతం పోలింగ్ బూత్‌ల్లో వెబ్‌కాస్టింగ్ అమలుచేయాలి. తెలంగాణలో 34,603 పోలింగ్‌బూత్‌లు ఏర్పాటుచేయనుండగా.. నాలుగువేల పోలింగ్ బూత్‌ల్లో వెబ్‌కాస్టింగ్ పెట్టనున్నారు. ఈ మేరకు సరిపడా హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ అందుబాటులో ఉన్నా మానవ వనరుల కొరత ఏర్పడే అవకాశం ఉన్నది.

ఏప్రిల్ 11 నుంచి జరిగే పోలింగ్‌ను లైవ్ వెబ్‌కాస్టింగ్ చేయడానికి ఆసక్తిగలవారు తమ పేర్లను https://bit.ly/webcat-2019అనే వెబ్‌సైట్ ద్వారా కానీ, మై జీహెచ్‌ఎంసీ యాప్ ద్వారా కానీ నమోదు చేసుకోవాలని జీహెచ్‌ఎంసీ ఐటీ విభాగం అదనపు కమిషనర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. అలాగే, ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆసక్తిగల సీనియర్ ఇంజినీరింగ్ విద్యార్థులు జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆమె కోరారు. అంతేకాకుండా సొంత ల్యాప్‌టాప్‌గల అభ్యర్థులు election [email protected] ను సంప్రదించాలన్నారు. వెబ్‌కాస్టింగ్ విధుల్లో పాల్గొనేవారికి తగిన పారితోషికంతో పాటు సర్టిఫికెట్ జారీ చేయనున్నట్టు పేర్కొన్నారు.

web casting jobs for loksabha electionsaక్రితం ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ అందలేదని టీచర్లు, ఇతర ఎన్నికల సిబ్బంది నుంచి ఫిర్యాదులు వచ్చినందున ఈ సారి పోస్టల్ బ్యాలెట్ల కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను వినియోగించనున్నది. పోస్టల్ బ్యాలెట్ ఎంత మందికి అం దింది? ఎవరికి చేరలేదు? ఓటు రిటర్నింగ్ అధికారికి వెళ్లిందా? లేదా? వంటి వివరాలన్నీ ఎప్పటికప్పుడు పర్యవేక్షించే అవకాశం కలుగనుంది.

Related posts