telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బిగ్ బాస్ : భారీ పారితోషికం ఈ ముగ్గురికి మాత్రమే…!

starmaa official on bigg boss 3 telugu

2006వ సంవత్సరంలో హిందీలో ఆరంభమైన ఈ రియాలిటీ షో ఫ్రాంచైజీ.. 2018కి కన్నడ, మలయాళీ, తెలుగు, తమిళ, మరాఠీ, బెంగాలీ భాషల్లో కూడా ఫేమస్ కావడం విశేషం. ఇకపోతే తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా జూలై 17 2017లో ‘బిగ్ బాస్’ మొదటి సీజన్ మొదలవగా.. వారాలు గడుస్తున్న కొద్దీ ప్రేక్షకాదరణ పొందుతూ హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్స్‌తో దూసుకుపోయింది. ఆ తర్వాత నాని హోస్ట్‌గా సాగిన రెండో సీజన్ కూడా మంచి వ్యూస్ రాబట్టుకుంది. మరోవైపు ఈ సీజన్‌లో కంటెస్టెంట్ కౌశల్ మందా గెలవడానికి ‘కౌశల్ ఆర్మీ’ బిగ్ బాస్ ఓటింగ్ సిస్టంను శాసించిందని చెప్పవచ్చు. ఇది ఇలా ఉండగా అక్కినేని నాగార్జున హోస్టుగా వ్యవహరించిన మూడో సీజన్ తాజాగా పూర్తయిన సంగతి తెలిసిందే. ఎన్నో మలుపులు, ట్విస్టులతో ఈ సీజన్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా రాహుల్ అండ్ పునర్నవి లవ్ ఎపిసోడ్స్ ఒక వర్గం ప్రేక్షకులను విపరీతంగా అలరించాయని చెప్పొచ్చు. ఇకపోతే రాక్‌స్టార్ రాహుల్ సిప్లిగంజ్ టైటిల్ విన్నర్ కాగా.. యాంకర్ శ్రీముఖి రన్నరప్‌గా నిలిచింది. ఇక ఆ తర్వాత బాబా భాస్కర్, వరుణ్ సందేశ్, అలీ రెజాలు తర్వాత స్థానాల్లో ఉన్నారు. ఇకపోతే ఇప్పటివరకు జరిగిన తెలుగు బిగ్ బాస్ సీజన్లలో ముగ్గురు కంటెస్టెంట్లు మాత్రమే భారీ పారితోషికం అందుకున్నారు. సీజన్ 1‌లో పాల్గొన్న నటుడు సమీర్ వారానికి 10 లక్షలు అందుకోగా.. సీజన్ 3లో హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి వారంలోనే ఎగ్జిట్ అయిన నటి హేమ వారానికి 9.7 లక్షలు అందుకున్నట్లు సమాచారం. వీరితో పాటు యాంకర్ శ్రీముఖి 100 రోజులకు 3 కోట్లు పారితోషికం పుచ్చుకుందని తెలుస్తోంది. అటు వరుణ్ సందేశ్ కూడా కోటి రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం.

Related posts