టీం ఇండియా క్రికెటర్ హార్ధిక్ పాండ్యా ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. పాండ్యా తండ్రి హిమాన్షు పాండ్యా ఇవాళ ఉదయానే మృతి చెందారు. గుండెపోటుతో ఆయన మృతి చెందినట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. హార్థిక్ పాండ్యా సోదరుడు కృణాల్ పాండ్యా ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో బరోడా కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. అయితే.. తండ్రి మరణవార్త తెలిసిన కృణాల్ పాండ్యా ఆ టోర్నీ నుంచి వైదొలిగాడు. ఈ విషయాన్ని జట్టు యాజమాన్యం పేర్కొన్నది. కృణాల్ నేతృత్వలోని బరోడా జట్టు.. ఇప్పటి వరకు ముస్తాక్ అలీ టోర్నీలో మూడు మ్యాచ్‌లను గెలిచింది. ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరిగే సిరీస్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నాడు. ముస్తాక్ అలీ టోర్నీలో హార్థిక్ ఆడటటం లేదు. ఇక హిమాన్షు పాండ్యా అంత్యక్రియలు రేపు జరుగనున్నట్లు తెలుస్తోంది.
next post
తాను కాంగ్రెస్ పార్టీలో చేరడం తప్పే.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు!