telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మెగాహీరో కొత్త సినిమా టైటిల్ ఇదే ?

Sai Dharam tej

ఇటీవలే ‘ప్రతీ రోజూ పండగే’ సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్న ఈ మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఆ తర్వాత వరుస సినిమాలను లైన్‌లో పెట్టి మంచి జోష్‌లో ఉన్నారు. ఒకవైపు ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాతో బిజీగా ఉంటూనే దేవకట్టా దర్శకత్వంలో మరో సినిమాను ఇప్పటికే అఫీషియల్‌గా ప్రారంభించారు సాయి తేజ్. భగవాన్, జె.పుల్లారావు నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన నివేదా పేతు రాజ్ హీరోయిన్‌గా నటించనుంది. సీనియర్ అండ్ పవర్‌ఫుల్ హీరోయిన్ రమ్యకృష్ణ ముఖ్యపాత్రలో కనిపించనుందట. సాయితేజ ఐఏయస్‌ ఆఫీసర్‌ పాత్రలో కన్పించనుండగా… షూటింగ్ ప్రారంభానికి ముందే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా టైటిల్ ఇదే అంటూ ఓ వార్త హల్చల్ చేస్తోంది. ఈ మూవీకి ‘రిపబ్లిక్’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు టాక్ నడుస్తోంది. లాక్‌డౌన్ కారణంగా రెగ్యులర్ షూట్ వాయిదా వేస్తూ వచ్చిన చిత్రయూనిట్ అతి త్వరలో సినిమాలు సెట్స్ పైకి తీసుకురానున్నారట. సాయి ధరమ్ తేజ్ గత సినిమాలకు బిన్నంగా, కొత్త కాన్సెప్ట్‌తో ఈ సినిమాని రూపొందించనున్నట్లు సమాచారం. కాగా ప్రస్తుతం సాయి తేజ్ నటించిన ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related posts