telugu navyamedia
సినిమా వార్తలు

బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్… ఇప్పుడేమో బికినీతో హాట్ గా…

Kim-SHarma

బాలీవుడ్ బ్యూటీ కిమ్ శర్మ తెలుగులో “ఖడ్గం” వంటి చిత్రాల్లో నటించినా స్టార్ హీరోయిన్ క్రేజ్ ను అందుకోలేకపోయింది. నటుడు హర్షవర్దన్ రాణే తెలుగులో పలు సినిమాల్లో నటించి నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. హిందీలో పలు ఆఫర్లు రావడంతో బాలీవుడ్‌ లో కూడా పలు చిత్రాల్లో నటిస్తున్నారు హర్షవర్దన్. గతకొంతకాలంగా ఖడ్గం ఫేం కిమ్ శర్మ, హర్షవర్దన్ చెట్టాపట్టాలేసుకుని తిరగడం, ఈ ఇద్దరూ ముంబై రోడ్లపై కలిసి తిరుగుతూ కెమెరా కంటికి చిక్కడంతో వీరిద్దరూ రిలేషన్ కొనసాగిస్తున్నారని జోరుగా ప్రచారం సాగింది. అయితే ఇప్పుడు ఈ జంట తమ రిలేషన్‌ షిప్ కు స్వస్తి చెప్పినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా కిమ్‌తో బ్రేకప్ విషయంపై ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పష్టత ఇచ్చాడు హర్షవర్దన్. “ధన్యవాదాలు నీతో ప్రయాణం అద్భుతం..అంతకంటే ఎక్కువ. నీకు, నాకు దేవుడి దీవెనలు ఉండాలి..బై” అంటూ పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్‌తో కిమ్, హర్షవర్దన్ మధ్య దాదాపు బ్రేకప్ అయిపోయినట్లేనని అంతా భావిస్తున్నారు. గతంలో క్రికెటర్ యువరాజ్‌సింగ్‌తో డేటింగ్‌లో ఉన్న కిమ్ శర్మ ఆ తరువాత హర్షవర్దన్‌తో డేటింగ్ చేసింది.

తాజాగా కిమ్ శర్మ తన బ్రేకప్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నట్లుగా అన్పిస్తోంది. ఎందుకంటే… గత నాలుగు రోజులుగా తన స్నేహితులతో కలిసి ట్రిప్ లకు వెళుతూ సమయం గడుపుతోన్న ఈ భామ తాజాగా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో బికినీ ఫోటో షేర్ చేసింది. వైట్ కలర్ బికినీ, గాగుల్స్ పెట్టుకొని చాలా హాట్ గా కనిపిస్తోంది. ఈ ఫోటో నెటిజన్లను ఆకర్షిస్తోంది.

Related posts