telugu navyamedia
సినిమా వార్తలు

“అల్లంత దూరాన” పాటను ఆవిష్కరించి… నిర్మాతను అభినందించిన కె.ఎస్.రామారావు

“అల్లంత దూరాన” చిత్రం పాటలతో పాటు కాన్సెప్ట్ చాలా బావున్నాయని ప్రముఖ నిర్మాత కె.ఎస్.రామారావు అన్నారు.
గతంలో బాలనటుడిగా,, ఆ తర్వాత హీరోగా రాణిస్తున్న విశ్వ కార్తికేయ తాజాగా నటించిన చిత్రం “అల్లంత దూరాన”. ఇందులో ఆయనకు జోడీగా ప్రముఖ నటి ఆమని మేనకోడలు హ్రితిక శ్రీనివాసన్ నాయిక గా నటించింది.

చలపతి పువ్వల దర్శకత్వం వహించారు. ఆర్.ఆర్. క్రియేటివ్ కమర్షియల్ పతాకంపై శ్రీమతి కోమలి సమర్పణలో నిర్మాత ఎన్. చంద్రమోహనరెడ్డి తెలుగు, తమిళ భాషలలో నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రంలోని “కొక్కొరొకో…” అనే పల్లవితో సాగే పాటను హైదరాబాద్ లోని తన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత కె.ఎస్.రామారావు ఆవిష్కరించారు. అనంతరం కె.ఎస్.రామారావు మాట్లాడుతూ, ఇది పేరుకు చిన్న చిత్రంగా అనిపించినా నిర్మాత ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు.

ఒకప్పటి చిత్రాల కోవలో కథ కథనాలకు అత్యంత ప్రాధాన్యమిస్తూ తీసినట్లుగా తెలిసింది. అందుకే ఎంతో అభిరుచి కలిగిన ఈ చిత్ర నిర్మాతను అభినందిస్తున్నాను. ఇలాంటి చిత్రాలు విరివిగా రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గీత రచయిత రాంబాబు ఈ చిత్రానికి సింగిల్ కార్డు రాయడం ఆయన పటిమను తెలియజేస్తోంది. గతంలో మేము తీసిన సినిమాలో రెండు పాటలు కూడా ఆయన రాశారు’ అని అన్నారు.
చిత్ర దర్శకుడు చలపతి పువ్వల మాట్లాడుతూ, “ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చిత్రమిది. చాలా క్వాలిటీగా చిత్రాన్ని తీశాం.

నిర్మాత సంపూర్ణ సహకారంతోనే ఓ మంచి చిత్రాన్ని తీయగలిగాం.” అని అన్నారు.
నిర్మాత ఎన్. చంద్రమోహనరెడ్డి మాట్లాడుతూ, “కె.ఎస్.రామారావు గారి క్రియేటివ్ కమర్షియల్ సంస్థ అంటే నాకు ఎంతో ఇష్టం. ఆ పేరు వచ్చేలా మా బ్యానర్ కు కూడా పేరు పెట్టుకున్నాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నాం. హైదరాబాద్ తో పాటు కార్వేటినగరం, పుత్తూరు, తిరుపతి, ఆర్.కె.వి.పేట, కేరళ, చెన్నై, పాండిచ్చేరి తదితర లొకేషన్లలో షూటింగ్ చేశాం. తెలుగుతో పాటు కొందరు ప్రముఖ తమిళ నటీనటులు కూడా ఇందులో నటించారు. త్వరలో చిత్రాన్ని విడుదల చేస్తాం” అని చెప్పారు.

హీరో విశ్వ కార్తికేయ మాట్లాడుతూ, “ఇలాంటి చిత్రంలో నటించడం నా కెరీర్ కు మంచి మలుపు అవుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తంచేయగా, చిత్రానికి తగ్గట్టుగా చక్కటి పాటలు కుదిరాయని గీత రచయిత రాంబాబు తెలిపారు.
ఈ చిత్రంలోని ఇతర ముఖ్య పాత్రలలో భాగ్యరాజా, అలీ, ఆమని, తమిళ్ జేపీ, తులసి, జార్డమేరియన్, అప్పాజీ, అనంత్ , ఇళవరసన్, డానియెల్, స్వామినాథన్, కృష్ణవేణి, నారాయణరావు, శివ తదితరులు తారాగణం.

ఈ చిత్రానికి పాటలు: రాంబాబు గోశాల, సంగీతం: రధన్ (జాతి రత్నాలు ), కెమెరా: కళ్యాణ్ బోర్లగాడ్డ, ఎడిటింగ్: శివకిరణ్,
డాన్స్: గోపి, ఫైట్స్: నాభ, ఆర్ట్: చంద్రమౌలి, సమర్పణ: శ్రీమతి కోమలి, నిర్మాత: ఎన్.చంద్రమోహనరెడ్డి, రచన-దర్శకత్వం: చలపతి పువ్వల.

Related posts