telugu navyamedia
సినిమా వార్తలు

నాడైనా.. నేడైనా త్రిగర్తల చరిత్రను తాకాలంటే.. బింబిసారుడి కత్తిని దాటాలి..

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘బింబిసార’. ప్యాన్ ఇండియా రేంజ్‌లో విడుదలవుతోన్న ఈ సినిమాలో హీరోయిన్స్‌గా క్యాథరిన్, సంయుక్త మీనన్ నటించారు. వశిష్ఠ.. దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమా ఆగష్టు 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది.

ఈ సందర్భంగా చిత్ర బృందం ప్ర‌మోష‌న్స్‌ వేగవంతం చేసింది. ఇప్పటికే టీజర్‌, ట్రైలర్‌, పాటలను విడుద‌ల చేయ‌గా  మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.  తాజాగా ఈ సినిమా  నుంచి  ‘రిలీజ్‌  ట్రైలర్‌తో మ‌రో పోస్ట‌ర్‌ విడుదల చేసింది. ఈ ట్రైలర్‌ను యంగ్‌టైగ‌ర్‌ ఎన్టీఆర్‌ సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేశారు.

త్రిగర్తల సామ్రాజ్యాధినేత బింబిసారుడితో పాటు కల్యాణ్‌ రామ్‌ పోషించిన మరో పాత్రను ఇందులో చూడొచ్చు. యుద్ధ విన్యాసాలు, పవర్‌ఫుల్ డైలాగ్స్‌, విజువల్స్‌తో ఈ పొస్ట‌ర్‌ ఆసక్తిగా రేపుతోంది.

హ‌ద్దుల‌ను చేరిపేస్తూ..మ‌న రాజ్యపు సరిహద్దులను ఆపై రాజ్యాలను దాటి విస్తరించాలి. శరణు కోరితే ప్రాణ భిక్ష… ఎదిరిస్తే మరణం.. నాడైనా.. నేడైనా త్రిగర్తల చరిత్రను తాకాలంటే.. బింబిసారుడి కత్తిని దాటాలి. మొత్తంగా రాజుగా.. సాధారణ వ్యక్తిగా కళ్యాణ్ రామ్ ఆహార్యం బాగుంది. మొత్తంగా కళ్యాణ్ రామ్ తన కెరీర్‌లో చేయనటు వంటి చాలెంజింగ్ పాత్రను ‘బింబిసార’లో చేసాడు.రాక్షసులు ఎరగని రావణ రూపం. శతృవులు గెలవలేని కురుక్షేత్ర యుద్ధం. త్రిగర్తల సామ్రాజ్యధినేత బింబిసారుడి విశ్వరూపం. బింబిసారుడు అంటేనే మరణ శాసనం తో పాటు  ఇక్కడ రాక్షసుడైనా.. భగవంతుడైనా బింబిసారుడుగా కళ్యాణ్ రామ్ చెప్పే డైలాగులు బాగున్నాయి

నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకంపై హరికృష్ణ.కె నిర్మిస్తున్న ఈ ఫాంటసీ యాక్షన్‌ చిత్రంలో ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించారు.

ఇక ‘బింబిసార’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ఈ నెల 29న హైదరాబాద్ శిల్పాకళా వేదికలో నిర్వహించనున్నారు. ఈ వేడుకకు కళ్యాణ్ రామ్ తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నాడు. ఈ సినిమాకు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అందించనున్నట్టు సమాచారం.

Related posts