telugu navyamedia
సినిమా వార్తలు

తెలుగులో పిచ్చి బూతులు తిడుతున్నారు : చిన్మయి

Chinmai

“అర్జున్ రెడ్డి” చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. సందీప్ వ్యాఖ్య‌ల‌పై మ‌హిళా లోకం భ‌గ్గుమంటోంది. ప‌లువురు హీరోయిన్లు, మ‌హిళా జ‌ర్నలిస్టులు సందీప్ వ్యాఖ్య‌ల‌పై అభ్యంతరం వ్య‌క్తం చేశారు. సందీప్ వంగా “అమ్మాయి, అబ్బాయి గాఢంగా ప్రేమించుకుంటున్నప్పుడు.. ఒకర్నొకరు కొట్టుకోవడం, ముట్టుకోవడం లాంటివి చేయకపోతే ఆ బంధంలో ఎమోషన్ ఉండ‌ద‌ని నా అభిప్రాయం” అని వ్యాఖ్యానించారు. అవికాస్తా వివాదానికి దారి తీయడంతో ఈ వ్యాఖ్య‌ల‌ను మీడియా త‌ప్పుగా అర్థం చేసుకుంద‌ని, ఎవ‌రినో కించ‌ప‌రిచే ఉద్దేశంతో తాను అలా అన‌లేద‌ని సందీప్ వివ‌ర‌ణ ఇచ్చారు. అయినప్పటికీ ఈ వివాదం సద్దుమణగడం లేదు. సింగర్ చిన్మయి సందీప్ వంగ చేసిన కామెంట్స్ ను ట్విట్టర్ ద్వారా షేర్ చేసి.. “కొట్టడం ప్రేమకు చిహ్నమా?” అని ప్రశ్నించారు. దీంతో చిన్మయిని కొంతమంది నెటిజన్లు టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు. ఆమె వ్యక్తిగత జీవితంపై వల్గర్ కామెంట్స్ చేస్తూ పోస్ట్ లు పెడుతున్నారు.

వీటిపై స్పందిస్తూ చిన్మయి మరో వీడియో విడుదల చేసింది. తన టైం లైన్ లో ట్వీట్స్ పెట్టి వ్యక్తిగత అభిప్రాయాన్ని వ్యక్తపరిచినందుకు చాలా మంది రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారని.. లేనిపోని గోల చేస్తున్నారని మండిపడింది. ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు ఏదైనా మాట్లాడినప్పుడు దానిపై అభిప్రాయం చెప్పడమనేది సాధారణ విషయమని.. తను కూడా అదే చేసినట్లు చెప్పింది. ఆ మాత్రం దానికి నీ భర్త నీకు విడాకులు ఇవ్వలేదా..? నీ భర్త ఇంకా చనిపోలేదా..? నువ్ ఇంకా బతికే ఉన్నావా..? అని అడుగుతున్నారని ఫైర్ అయింది. తెలుగులో పిచ్చి బూతులు తిడుతున్నారని.. మూడో ప్రపంచయుద్ధం వచ్చినంతగా ఫీల్ అయిపోతున్నారని చెప్పింది. ఎవరెన్ని మాటలు అన్నా.. తనపై ఏ మాత్రం ఎఫెక్ట్ చూపవని ఆ విషయం గ్రహిస్తే మంచిదని అన్నారు.

Related posts