telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అలీ రెజా ఇంట్లో విషాదం… భావోద్వేగ పోస్ట్

Ali-Reza

బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 3 ఆదివారం ఎపిసోడ్‌తో స‌క్సెస్‌ఫుల్‌గా 50 రోజులు (ఏడు వారాలు) పూర్తి చేసుకుంది. ఏడవ వారం అలీరేజా ఎలిమినేట్ అయ్యి అందరికీ షాకిచ్చాడు. ఈ విషయాన్ని ఇంటి సభ్యులు, ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ సీజన్ లో ప్రతి టాస్క్ లో అలీ బలమైన పోటీ ఇస్తూ వస్తున్నాడు. కాస్త అగ్రసివ్ గా ఉంటున్నా, అతడిపై విమర్శలు ఉన్నా అవి అలీకి పెద్ద సమస్య కాదని అంతా భావించారు. బిగ్ బాస్ ఇంట్లోకి అలీ రీ ఎంట్రీ ఇస్తే బాగుంటుంద‌ని చాలా మంది కోరుతున్నారు. అయితే త‌ను వెళ్లే స‌మ‌యంలో ప్ర‌తి ఒక్క‌రు క‌న్నీళ్ళు పెట్టుకోవ‌డంతో, నాకు టైటిల్ ద‌క్క‌క‌పోయిన స‌రే ఇంత మంది మ‌న‌సులు గెలుచుకున్నాను అని అలీ ఎంతో ఉద్వేగంతో చెప్పుకొచ్చాడు.

అలీ రెజా బిగ్ బాస్ ఇంట్లో ఉన్న స‌మ‌యంలోనే ఆయ‌న మామ‌య్య క‌న్నుమూశారు. ఆ విష‌యం ఆయ‌న‌కి బిగ్ బాస్ ఇంటి నుండి బ‌య‌ట‌కి వ‌చ్చిన త‌ర్వాత తెలిసింది. దీంతో త‌న మామ‌య్య‌తో క‌లిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ భావోద్వేగ‌పు పోస్ట్ పెట్టాడు. “మీరు నా జీవితంలో విజ‌యాన్ని చూడాల‌ని అనుకున్నారు. ఇప్పుడు న‌న్ను చాలా మంది ప్రేమిస్తున్నారు. కాని మీరు అవి చూసేందుకు లేరు. మిమ్మ‌ల్ని చివ‌రి క్ష‌ణంలో చూడ‌లేక‌పోయాన‌నే బాధ నాకు చాలా ఉంది. బిగ్ బాస్ నాకు ఎంత ముఖ్య‌మో మా అమ్మ‌, నాన్న‌కి తెలుసు. కాబ‌ట్టి ఆ స‌మాచారం నాకు ఇవ్వ‌లేదు. కాని మీరు నాకు అంతే ముఖ్య‌మ‌ని వారికి తెలియ‌దు. బిగ్ బాస్ ఎలిమినేష‌న్ నాకు ఒక షాకిస్తే , మిరు లేర‌న్న వార్త మ‌రింత షాక్‌కి గురి చేసింది మామ‌. ఇంట్లో అంద‌రు ఎంతో బాధ‌లో ఉన్న‌ప్ప‌టికి వారు నన్ను సంతోషంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు. అందరూ నాకు సపోర్ట్‌ను ఇస్తున్నారు. అంద‌రు నాపై చూపిస్తున్న ఈ ప్రేమ‌ని చూశాక నాకు ఇంకెమీ అవసరం లేదనిపిస్తోంది. మామా నువ్వు బెస్ట్‌. నిన్ను అంతిమ సమయంలో చూడలేకపోయినందుకు నేనెప్పుడూ బాధపడుతూనే ఉంటాను. లవ్‌ యూ ఫర్‌ ఎవర్‌. నీ ఆత్మకు శాంతి చేకూరాలి” అంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. దీనికి యాంక‌ర్ ర‌వి స్పందిస్తూ “ఆయ‌న ఆత్మ‌కి శాంతి క‌ల‌గాల‌ని కోరుకుంటున్నాను” అని పోస్ట్ పెట్టారు.

Related posts