telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

డిజిటల్ ప్లాట్‌‌ఫాంలతో కలిసి వెబ్ సిరీస్ చేసేందుకు తేజ సన్నాహాలు

Teja

టాలీవుడ్ డైరెక్టర్ తేజ డిజిటల్ ప్లాట్‌‌ఫాంలతో కలిసి వెబ్ సిరీస్ చేసేందుకు సిద్దమౌతున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే పలు కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఫ్యూచర్ అంతా ఓటీటీ ప్లాట్‌‌ ఫాంలదే అయ్యేటట్టు ఉంది. ఇప్పటికే చాలా మంది నటులు వెబ్‌ సిరీస్‌ల నటిస్తున్నారు కూడా. బాగా పేరున్న డిజిటల్ ప్లాట్ ఫాంలతో వెబ్ సిరీస్‌లు చేసేందుకు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. ఇప్పటికే తరుణ్ భాస్కర్, ప్రశాంత్ వర్మ, సంకల్ప్ రెడ్డి తదితర యువ దర్శకులు వెబ్ సిరీస్ చిత్రీకరణాల్లో బిజీగా ఉండగా.. ఇప్పుడా జాబితాలోకి తేజా కూడా చేరిపోయినట్లు సమాచారం. త్వరలోనే హాట్ స్టార్‌ కోసం వెబ్ సిరీస్‌లు చేసేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. అమెజాన్‌తో కలిసి ఓ సినిమా తెరకెక్కించనున్నట్లు చిత్ర పరిశ్రమలో టాక్ వినిపిస్తోంది. కాగా ప్రస్తుతం తేజ గోపిచంద్‌తో ‘అలిమేలుమంగ వెంకట రమణ’, రానా హీరోగా ‘రాక్షస రాజు రావణాసురుడు’ సినిమాలు తెరకెక్కిస్తున్నాడు.

Related posts