telugu navyamedia
క్రైమ్ వార్తలు

కర్ణాటకలో బీజేపీ కార్య‌క‌ర్త‌ ప్రవీణ్ దారుణ హత్య..

కర్ణాటకలో బీజేపీ కార్యకర్తను దారుణంగా హత్య చేశారు. మంగళవారం సాయంత్రం కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో బీజేపీ యువమోర్చా కార్యకర్త ప్రవీణ్ నెట్టారును బైక్‌పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు మారణాయుధాలతో దాడికి పాల్ప‌డ్డారు. రక్తపు మడుగులో పడి ఉన్న అతడిని ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో క‌ర్ణాట‌క‌లోని పలు ప్రాంతాల్లో బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేట‌డ్డంతో ఉద్రిక‌త్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి

ఈ ఘటన నేపథ్యంలో దక్షిణ కన్నడ జిల్లా బెల్లారే గ్రామంలో భద్రతా బలగాలను మోహరించారు. శాంతిభద్రతలను కాపాడేందుకు మంగళూరు, ఉడిపి నుంచి అదనపు పోలీసు బలగాలను కూడా రప్పించారు. ఈ దారుణమైన చర్యకు పాల్పడిన నిందితులను

నిందితులను పట్టుకునేందుకు ఐదు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. నిందితుల కోసం ఐదు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. ఐదుగురిలో మూడు బృందాలను కేరళ, మడికేరి కర్ణాటకలోని హాసన్‌లకు పంపారు” అని జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రుషికేష్ సోనానయ్ తెలిపారు.

కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై బీజేపీ యువనేత హత్యపై విచారం వ్యక్తం చేశారు. నిందితులను త్వరలో అరెస్టు చేసి శిక్షిస్తామని హామీ ఇచ్చారు. ఇలాంటి నీచమైన చర్యకు పాల్పడిన వారిని త్వరలో అరెస్టు చేసి చట్ట ప్రకారం శిక్షిస్తాం. ప్రవీణ్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను’ అని బొమ్మై ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

అలాగే బీజేపీ కార్యకర్త దారుణ హత్యను ఖండిస్తూ హిందూ సంస్థలు బంద్‌కు పిలుపునిచ్చాయి. దీంతో బుధవారం సులియా, కడబ, పుత్తూరు సహా పలు తాలూకాల్లో బంద్ జరిగింది. ప్రధాన వాణిజ్య సంస్థలు, స్కూళ్లు మూతపడ్డాయి.

ప్రవీణ్ హత్యపై ఆందోళన చేపట్టిన బీజేపీ కార్యకర్తలు, నిరసనకారులు.. దక్షిణ కన్నడ ఎంపీ నలిన్ కుమార్ కారుపై దాడి చేశారు. కారును చుట్టుముట్టి ఊపేశారు. మరోవైపు వివిధ ప్రాంతాల్లో ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు.

Related posts