telugu navyamedia
క్రైమ్ వార్తలు

ఐదేళ్ల కూతురిపై క‌న్న‌తండ్రి తరచూ అత్యాచారం…

కన్నతండ్రి అనే పదానికే మచ్చ తెచ్చాడో ఓ కామాంధుడు. కన్నకూతురిని అపురూపంగా చూసుకోవాల్సినవాడు.. కన్నకూతురి పట్ల కామపిశాచిలా మారాడు… అభం సుభం తెలియని చిన్నారిపై కన్నేసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు…
ఆంధ్రప్రదేశ్​లోని పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం బొప్పూడిలో ఈ దారుణం చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే..

పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం బొప్పూడి గ్రామానికి చెందిన నూర్ భాషా ఆదం షఫీకి 2016లో నాదెండ్ల మండలం అమీన్ సాహెబ్ పాలెేనికి చెందిన హుస్సేన్ బీతో వివాహం జరిగింది. వీరికి ఒక పాప, బాబు ఉన్నారు. పాపకు ఐదేళ్లు. ఆదం షఫీ బొప్పూడిలో ఉంటూ.. చిలకలూరిపేటలోని కళామందిర్ సెంటర్ వద్ద ఉన్న తిను బండారాల దుకాణంలో పని చేస్తున్నాడు.

కుమార్తె ఓ పాఠశాలలో చదువుకుంటోంది. ఐతే కొంతకాలంగా స్కూల్ కు వెళ్లేటప్పుడు, స్నానం చేసే సమయంలో నొప్పిగా ఉంటోందని ఏడుస్తుండేది. రాత్రిపూట నాన్న పక్కన పడుకోపెట్టవద్దని ఏడుస్తూ తల్లికి చెప్తుండేది.

తొలుత పాప చెప్పిన మాటలు పెద్దగా పట్టించుకోని తల్లి.. ఆ తర్వాత సీరియస్ గా తీసుకుంది. భర్త ఏమైనా చేస్తున్నాడా అనే అనుమానంతో అతడిపై నిఘా ఉంచింది.. భర్త ఇలాంటి దుర్మార్గానికి పాల్పడతాడా..? అనే సందేహం వచ్చింది. ఈ క్రమంలో గత ఆదివారం రాత్రి భోజనం చేసి నలుగురు పడుకున్నారు. అంతలోనే భర్త తను బయటికి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లి.. 11 గంటలకు ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో హుస్సేన్ బీ నిద్రపోతున్నట్లు నటిస్తూ.. భర్త చేసే పనులు గమనించింది. భార్య నిద్ర పోతుందా లేదా..? అని సెల్​ఫోన్ లైట్ వేసి చూశాడు.

నిద్ర పోతున్నానని గుర్తించి వెంటనే కుమార్తె పక్కన పడుకుని సెల్ ఫోన్ ఆన్ చేశాడు. అందులో అశ్లీల వీడియోలు చూస్తూ కూతురిపై అఘాయిత్యనికి పాల్పడ్డాడు. అందులో నీలిచిత్రాలు చూస్తూ తన నిద్రిస్తున్న కన్న కూతురిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. గమనించిన భార్య హుస్సేన్ బీ వెంటనే భర్తను పట్టుకుంది.

ఇంత దారుణానికి ఒడిగట్టిన తన భర్తలాంటి దుర్మార్గులు భూమి మీద ఉండకూడదని రోదించింది. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది.. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.

కన్నకూతురిపై అఘాయిత్యానికి పాల్పడిన ఇలాంటి వాడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు పోలీసులను డిమాండ్ చేశారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు.

Related posts