telugu navyamedia
క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

ఎట్టకేలకు నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు!

one by one hanging to nirbhaya

ఘటన జరిగిన ఏడేళ్ల తర్వాత నిర్భయ దోషులు ఉరిశిక్ష అమలు అయింది. ఈ తెల్లవారుజామున 5:30 గంటలకు దేశ రాజధాని డిల్లీలోని తీహార్ జైలు అధికారులు దొషులు పవన్ కుమార్, అక్షయ్ కుమార్, ముఖేశ్ సింగ్, వినయ్ శర్మలకు ఉరిశిక్షను అమలు చేశారు. అంతకుముందు వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు.నలుగురి ఆరోగ్య పరిస్థితి బాగుందని తీహార్‌ జైలు వైద్యాధికారులు ప్రకటించారు. ఉరితీత నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టిన అధికారులు జైలును లాక్‌డౌన్ చేశారు. మరోవైపు, జైలు బయట జనం పెద్ద సంఖ్యలో గుమిగూడారు.

మీరట్ నుంచి వచ్చిన తలారి పవన్ జల్లాడ్ నిర్భయ దోషులైన ముఖేశ్ సింగ్, పవన్ గుప్తా, అక్షయ్ ఠాకూర్, వినయ్ శర్మలను ఉరితీశాడు. దక్షిణాసియా దేశంలోనే అతి పెద్దదైన తీహార్ జైలులో ఒకే నేరానికి సంబంధించి నలుగురిని ఉరితీయడం ఇదే తొలిసారి. ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు చివరి క్షణం వరకు దోషులు చేసిన ప్రయత్నాలేవీ ఫలితంచలేదు. చట్టపరంగా వారికి ఉన్న అన్ని హక్కులు ఉపయోగించుకున్నారు. నిర్భయ ఘటన ఢిల్లీలో 2012 డిసెంబర్‌ 16వ తేదీన జరిగిన సంగతి తెలిసిందే. బాధితురాలు 13 రోజులు మృత్యువుతో పోరాడి డిసెంబర్ 29న తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. దీంతో ఘటన జరిగిన ఏడేళ్ల తర్వాత వారికి ఉరిశిక్ష అమలైంది. నిర్భయ దోషులకు మరణ దండన అమలు కావడంపై నిర్భయ తల్లిదండ్రులతోపాటు దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తం చేస్తునారు. 

Related posts