హైదరాబాద్‌లో వరుస పరువు హత్యలు కలకలం రేపుతున్నాయి. అందరూ చూస్తుండగా నడిరోడ్డుపైన వేటాడి, వెంటాడుతూ నరికి చంపుతున్నదృశ్యాలు ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తోంది.
కొద్దిరోజుల క్రితం సరూర్‌నగర్‌లో నాగరాజు హత్య ఘటనను మరిచిపోకముందే బేగంబజార్‌లో మచ్చి మార్కెట్ వద్ద శుక్రవారం రాత్రి నీరజ్ పన్వార్‌ను అత్యంత దారుణంగా హత్య చేశారు.
వివారాల్లోకి వెళితే..
బేగంబజార్ కోల్సావాడికి చెందిన నీరజ్‌కుమార్ పన్వర్(22) పల్లీల వ్యాపారం చేస్తుంటారు. అదే ప్రాంతానికి చెందిన సంజన(20)ను ఏడాదిన్నర కిందట ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వీరికి నెలన్నర క్రితం బాబు పుట్టాడు. ప్రేమ పెళ్లి ఇష్టంలేని సంజన కుటుంబసభ్యులు నీరజ్ కుమార్ పై కక్ష పెంచుకున్నట్లు తెలుస్తోంది.
నీరజ్‌ను సంజన సోదరుడు ఆరునెలలుగా చంపాలని ప్రయత్నించినట్లు తెలుస్తోంది. శుక్రవారం సాయంత్రం సంజన సోదరుడు, అతని స్నేహితులు నీరజ్ రోడ్డు దాటుతున్నప్పుడు వెనుక నుంచి గ్రానైట్ రాయితో దాడి చేశారు. రాయితో తలపై మోది హత్య చేశారు. అనంతరం నీరజ్ ను వెంబండించి కొబ్బరిబొండాల కత్తితో 20 పోట్లు పొడిచి అత్యంత దారుణంగా హత్య చేశారు.
ఈ పరువు హత్య కేసులో ఐదుగురి నిందితులను పోలీసులు కర్ణాటకలో అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. హత్య చేసిన తర్వాత నిందితులు కర్ణాటక వైపు పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు.
హైదరాబాద్‌కు 150 కి.మీ.దూరంలో కర్ణాటకలోని గుడిమిత్కల్‌లో నిందితులను పశ్చిమ మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. అయితే సీసీ కెమెరాల ఆధారంగా హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ మర్డర్ కేసులో అనుమానం ఉన్న మరో 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.