అసోంలోని గోల్పారా జిల్లాలో ఏనుగులు జనం వెంటపడి బీభత్సం సృష్టించాయి. జిల్లాలోని ఓ గ్రామంపై దండెత్తిన ఏనుగులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాయి. వారిని పరుగులు పెట్టించి దాడికి పాల్పడ్డాయి. ఈ దాడిలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారిలో ఓ బాలుడు సహా ముగ్గురు మహిళలు ఉన్నారు.
“లాడెన్” అనే ఏనుగు ఇటీవలి కాలంలో ఇలా గ్రామాలపై పడి బీభత్సం సృష్టిస్తుంది. దాని బారినపడి ఇప్పటి వరకు 50 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, అటవీశాఖ అధికారులు గ్రామానికి చేరుకుని ఏనుగులను అడవిలోకి తరిమికొట్టారు. గాయపద్దవారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కులమతాలను రెచ్చగొట్టడం ఆనవాయితీగా మారింది: మంత్రి శ్రీనివాస్ గౌడ్