telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. టాలీవుడ్‌లో భారీ మల్టీస్టారర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా పై దర్శకుడు టీజర్ లతో అంచనాలను మరింతగా పెంచేశారు. ఇందులో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్‌కు జంటగా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన ఇంగ్లిష్ నటి ఒలివియా మోరిస్ నటిస్తున్నారు. అయితే.. ఈ మూవీలో అల్లూరిగా నటిస్తున్న రామ్‌ చరణ్‌ పుట్టిన రోజు రేపే. ఈ సందర్భంగా ఆర్‌ఆర్‌ఆర్‌ నుంచి ఓ సర్‌ఫ్రైజ్‌ వచ్చేసింది. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు సీతారామరాజు నయా అవతార్‌ రిలీజ్‌ చేస్తామని.. అభిమానులందరూ సిద్ధంగా ఉండాలని తెలిసింది చిత్ర బృందం.  అయితే ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి పోస్టర్‌లు, టీజర్‌లు అన్నీ కూడా ప్రేక్షకుల అంచనాలకు మించి ఉన్నాయి. ఈ సినిమా అక్టోబర్ 13న విడుదల కానున్న విషయం తెలిసిందే.

Related posts