telugu navyamedia
సినిమా వార్తలు

స్టార్ హీరోతో డేటింగ్… స్పందించిన హీరోయిన్

Tara-Sutaria

“స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్-2” సినిమాలో నటిస్తోన్న తారా సుతారియా తన సహ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాతో డేటింగ్ లో ఉందనే వార్తలు గత కొన్నిరోజులుగా బాలీవుడ్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై నటి తారా స్పందించింది. సిద్ధార్థ్ తాను డేటింగ్ చేస్తున్నానంటూ వస్తోన్న వార్తల్లో నిజం లేదని, అవన్నీ అవాస్తవాలేనని తేల్చి చెప్పింది. తామిద్దరం మంచి స్నేహితులమని, సిద్ధార్థ్ తన ఇంటి దగ్గర్లోనే ఉంటారని, అతకుమించి అతడు మంచి స్నేహితుడని, మేం ఎప్పుడూ డేటింగ్ లో లేమని ఓ రేడియో ఛానెల్ లో చెప్పి తనపై వస్తోన్న పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టింది. కరణ్ జోహార్ నిర్వహించే కాఫీ విత్ కరణ్ షోలో కూడా తారాను సిద్ధార్థ్ గురించి ప్రశ్నిస్తే ఈ రకమైన సమాధానమే చెప్పింది. ఇటీవలే ఈ బ్యూటీ “మర్జావన్” సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది.

Related posts