telugu navyamedia
సినిమా వార్తలు

“ఆవిరి” ఫ్యామిలీ థ్రిల్లర్ మాత్రమే… : రవిబాబు

Aaviri

`అల్ల‌రి`, `న‌చ్చావులే`, `అన‌సూయ‌`, `అవును`, `అవును 2` వంటి ప‌లు చిత్రాల ద్వారా త‌న‌దైన మార్కుతో ద‌ర్శ‌కుడిగా ర‌విబాబు త‌న‌కంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు. ప్ర‌స్తుతం ఈయ‌న ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం `ఆవిరి`. ర‌విబాబు, నేహా చౌహాన్‌, శ్రీముక్త‌, భ‌ర‌ణి శంక‌ర్‌, ముక్తార్ ఖాన్ ప్ర‌ధాన తారాగ‌ణంగా నటిస్తున్నారు. హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో ఎ ఫ్ల‌యింగ్ ఫ్రాగ్స్ ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై ర‌విబాబు దర్శ‌క నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని `యు/ఎ` స‌ర్టిఫికేట్‌ను పొందింది. న‌వంబ‌ర్ 1న సినిమాను విడుద‌ల చేస్తున్నారు. ప్రస్తుతం సినిమా ప్రమోషన్లలో చిత్రబృందం బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో సినిమా గురించి ర‌విబాబు మాట్లాడుతూ “ఆవిరి సినిమా హార‌ర్ సినిమా కాదు. ఫ్యామిలీ థ్రిల్ల‌ర్‌. నిజానికి నేను డైరెక్ట్ చేసిన ఏ చిత్రమూ హార‌ర్ కాదు. ఎక్క‌డా దెయ్యాలు, ఆత్మ‌లు క‌న‌ప‌డ‌లేదుగా. కాబ‌ట్టి అన్నీ చిత్రాల‌ను థ్రిల్ల‌ర్ చిత్రాలుగానే భావించాలి. అలాగే నా సినిమాల్లో క‌థ‌ను చెప్ప‌డంపైనే నేను ఫోక‌స్ పెడ‌తాను. ప్రేక్ష‌కుల‌ను ఏదో భ‌య‌పెట్టాల‌ని ఆలోచించ‌ను. ప్రేక్ష‌కుల‌ను భ‌య‌పెడితేనే ప్రేక్ష‌కులు థ్రిల్ అవుతార‌ని ఎప్పుడూ అనుకోలేదు” అని తెలిపారు.

Related posts