telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘వైల్డ్‌డాగ్’ భామకు ప్రెగ్నెన్సీ… ఫోటోలు వైరల్

కింగ్‌ నాగార్జున హీరోగా అషిషోర్‌ సాల్మన్‌ దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ మూవీ ‘వైల్డ్‌డాగ్’. దియా మీర్జా, సయామీఖేర్‌, అలీ రెజా, మ‌యాంక్‌, ప్ర‌దీప్‌, ప్ర‌కాశ్ కీల‌క‌పాత్ర‌ల్లో న‌టించిన ఈ మూవీని ‌మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.6గా నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మించారు. ఏప్రిల్‌2న ప్రపంచ‌వ్యాప్తంగా విడుద‌లై స‌క్సెస్‌ఫుల్ టాక్‌తో మంచి క‌లెక్ష‌న్స్ సాధిస్తోంది. అయితే.. ఈ మూవీలో నటించిన దియా మీర్జా అభిమానులకు శుభవార్త చెప్పింది. తాజాగా తాను గర్భం దాల్చాలని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఈ సందర్‌భంగా బేబీ బంప్‌ ఉన్న ఫోటోను ఆమె తన ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. కాగా.. ఫిబ్రవరిలో ఆమె.. వ్యాపారవేత్త వైభవ్‌ రేఖీని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఆమె భర్తతో కలిసి మాల్దీవుల్లో ఎంజాయ్‌ చేస్తోంది.

Related posts