గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా వస్తున్న విషయం తెలిసిందే. అయితే కేతాలం దేశంలోనే కాకుండా మన తెలంగాణలో కూడా రోజువారీ కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. తాజాగా తెలంగాణలో 1321 కరోనా కేసులు నమోదవ్వగా, ఐదుగురు మృతి చెందారు. కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్న సమయంలో ప్రభుత్వం సమూహాలపై దృష్టి సారించింది. ఎక్కువ మంది ఒకేచోట ఉండొద్దని హెచ్చరిస్తోంది. ఇక ఇదిలా ఉంటె, నిజామాబాద్ జిల్లాలోని వర్ని మండలంలోని సిద్దాపూర్ గ్రామంలో కరోనా కలకలం రేగింది. ఇటీవలే ఆ గ్రామంలో ఓ వివాహం జరిగింది. ఈ వివాహానికి వందలాది మంది హాజరయ్యారు. దీంతో వివాహానికి హాజరైన వారిలో 370 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు. ఇందులో 86 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. ఈరోజు మరికొంతమందికి కరోనా టెస్టులు చేసేందుకు సిద్ధమయ్యారు అధికారులు. సిద్దాపూర్ లో ఆరోగ్యశాఖాధికారులు క్యాంప్ ను ఏర్పాటు చేసి టెస్టులు నిర్వహిస్తున్నారు. చూడాలి మరి అందులో ఎన్ని కేసులు వస్తాయి అనేది.
previous post
next post
సుప్రీంకోర్టు తీర్పు కేంద్రానికి చెంపపెట్టు: సాధినేని యామిని