శాంసంగ్ తన A సిరీస్‌లో A50, A30కి కొన్ని మార్పులు చేసి A50s, A30s పేరిట కొత్తమోడళ్లను తీసుకొచ్చింది. ఈ ఫోన్లను అటు ఆన్‌లైన్, ఇటు ఆఫ్‌లైన్‌లోనూ విక్రయించనున్నట్లు కంపెనీ తెలిపింది. శాంసంగ్ A50s 4జీబీ/128జీబీ వేరియంట్ ధరను రూ.22,999గా నిర్ణయించింది. 6జీబీ/128జీబీ వేరియంట్ ధరను రూ.24,999గా పేర్కొంది. కేవలం 4జీబీ/64జీబీ వేరియంట్‌లో వస్తున్న A30s ధరను రూ.16,999గా నిర్ణయించింది. ఈ రెండు ఫోన్లూ ప్రిజమ్ క్రష్ వైలెట్, ప్రిజమ్ క్రష్ బ్లాక్, ప్రిజమ్ క్రష్ వైట్ కలర్స్‌లో లభ్యం కానున్నట్లు కంపెనీ తెలిపింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, పేటీఎం మాల్, శాంసంగ్ ఆన్‌లైన్ మార్కెట్స్‌తో పాటు దేశవ్యాప్తంగా వివిధ రిటైల్ స్టోర్స్‌లో నేటి నుంచే ఈ ఫోన్ లభ్యం కానున్నట్లు కంపెనీ వెల్లడించింది.
A50s ఫీచర్స్ :
ఆండ్రాయిడ్ 9 పై ఓఎస్‌తో శాంసంగ్ వన్ యూఐతో ఈ ఫోన్ పనిచేస్తుంది. 6.4 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ ఇన్ఫినిటీ ‘యూ’ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తున్న ఈ ఫోన్‌లో ఎక్జినోస్ 9611 ప్రాసెసర్‌ను వినియోగించారు. ఇందులో వెనుక వైపు ట్రిపుల్ కెమెరా ఉంది. 48+8+5 ఎంపీల కెమెరాలు ఇందులో అమర్చారు. ముందువైపు 32 ఎంపీల కెమెరా ఉంది. 4000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తున్న ఈ ఫోన్ 15W ఫాస్ట్‌ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇందులో ఎన్‌ఎఫ్‌సీ, ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సర్ ఉన్నాయి.
A30s ఫీచర్స్ :
ఆండ్రాయిడ్ 9 పై ఓఎస్‌తో శాంసంగ్ వన్ యూఐపై ఈ ఫోన్ పనిచేస్తుంది. 6.4 హెచ్‌డీ+ ఇన్ఫినిటీ ‘వీ’ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేతో ఈ ఫోన్ వస్తోంది. ఎగ్జినోస్ 7904 ప్రాసెసర్‌తో వస్తున్న ఈ ఫోన్‌లో వెనుక వైపు 25+8+5 ఎంపీ కెమెరాలను అమర్చారు. ముందువైపు 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. 4000ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తున్న ఈ ఫోన్ 15W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇందులో కూడా ఎన్‌ఎఫ్‌సీ, ఇన్‌బిల్ట్ ఫింగర్‌ప్రింట్ సెన్సర్ ఉంది.