telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ

అసదుద్దీన్ మధ్యవర్తిత్వంలో.. సబితా ఇంద్రారెడ్డి .. తెరాస లోకి.. !!

Congress Revanth meet Sabhitha Indrareddy

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ రేపోమాపో విడుదల కానున్న నేపథ్యంలో దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. కాంగ్రెస్ కీలక నేతలపై టీఆర్‌ఎస్ గురి పెట్టింది. ఆపరేషన్ ఆకర్ష్ స్పీడ్ పెంచింది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీఆర్‌ఎస్‌లో ఆమె చేరేందుకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు తెలిసింది. అసదుద్దీన్‌ నివాసంలో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో సబితా ఇంద్రారెడ్డి, ఆమె కుమారుడు కార్తీక్‌రెడ్డి భేటీ అయినట్లు సమాచారం. రెండు రోజుల్లో కేసీఆర్‌తో సబితాఇంద్రారెడ్డి భేటీ కానున్నట్లు తెలిసింది.

ఈ భేటీ సఫలం అయితే, చేవెళ్ల ఎంపీ స్థానం నుంచి సబితాఇంద్రారెడ్డి గానీ, ఆమె కుమారుడు గానీ టీఆర్‌ఎస్ తరపున పోటీ చేసే అవకాశాలున్నాయి. ఇదిలా ఉంటే.. టీఆర్ఎస్‌లో చేరుతామని ఎమ్మెల్యేలు సండ్ర, ఆత్రం సక్కు, రేగా కాంతారావు, చిరుమర్తి లింగయ్య ప్రకటించిన సంగతి తెలిసిందే. రేపు టీఆర్ఎస్‌ఎల్పీ సమావేశం జరగనుంది. ఈ కీలక సమావేశానికి కేసీఆర్ హాజరుకానున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై టీఆర్ఎస్ మాక్ పోలింగ్ నిర్వహించున్నట్లు తెలిసింది.

Related posts