telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మరో సినిమాకు ఓకే చెప్పిన మాస్టర్‌

Vijay

ఇళయ దళపతి విజయ్ హీరోగా ఇటీవల ‘ఖైదీ’ చిత్రంతో ఆకట్టుకున్న లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘మాస్టర్’. ఎక్స్ బి ఫిలిమ్ క్రియేటర్స్ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ డ్రామాలో విజయ్ సరసన మాళవిక మోహనన్ హీరోయిన్‌గా నటిస్తుండగా ఆండ్రియా జెరెమియా, అర్జున్ దాస్, నాజర్, సంజీవ్, సంతానం ఇతర పాత్రల్లోనూ, ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి విలన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌, రీరికార్డింగ్‌, డబ్బింగ్‌ పూర్తయి తెలుగు, తమిళ భాషల్లో విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయడానికి తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో సహా అన్ని ఓటీటీ సంస్థలు ‘మాస్టర్‌’ చిత్రాన్ని కొనేందుకు పోటీపడుతున్నాయి. ఈ నేపథ్యంలో విజయ్‌ తాజాగా మరో సినిమాను ప్రకటించాడు. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్‌ పిక్చర్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. పండుగ తర్వాత ఈ సినిమా పనులు మొదలు కానున్నాయి. అన్నీ ప్లాన్‌ ప్రకారమే జరిగితే ఈ సినిమా వచ్చే దీపావళికి రిలీజ్‌ చేయాలని భావిస్తున్నారట నిర్మాతలు. దీంతో విజయ్‌ ఫ్యాన్స్‌ చాలా ఖుషిగా ఉన్నారట.

Related posts