telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

100 మిలియన్ వ్యూస్ దాటిన ఇస్మార్ట్ శంకర్ హిందీ వెర్షన్

ismart sanker

పూరీ జగన్నాథ్, రామ్ కలయికలో వచ్చిన “ఇస్మార్ట్ శంకర్” చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అయింది. ఈ చిత్రంలో రామ్ సరసన నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్స్‌గా నటించిన సంగతి తెలిసిందే. గతేడాది విడుదలై ఎక్కువ లాభాలను తీసుకొచ్చిన చిత్రాల్లో ‘ఇస్మార్ట్ శంకర్’ ముందు వరుసలో ఉంది. రామ్ కెరీర్‌లో కూడా తొలిసారి రూ.40 కోట్ల షేర్‌ ఈ చిత్రంతో అందుకున్నాడు. ఎన్టీఆర్‌తో చేసిన “టెంపర్” తర్వాత సరైన సక్సెస్ లేని పూరీ జగన్నాథ్‌కు ఈ చిత్రం నిర్మాతగా, దర్శకుడిగా మంచి లాభాలని తీసుకొచ్చింది. ఈ సినిమా టీవీలో ప్రసారం చేస్తే అదిరిపోయే టీఆర్పీ రేటింగ్స్ వచ్చాయి. అంతేకాదు ఈ సినిమాలో విడుదలైన ప్రతి పాట యూట్యూబ్‌లో అరాచకం సృష్టించాయి. తాజాగా ఈ చిత్రాన్ని హిందీలో డబ్ చేసి యూట్యూబ్‌లో ఫిబ్రవరి 16న విడుదల చేసారు. ఈ చిత్రం యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసి 24 గంటలు గడవక ముందే 11 మిలియన్ వ్యూస్ సంపాదించింది. తాజాగా ఈ చిత్రం యూట్యూబ్‌లో 100 మిలియన్ వ్యూస్ సాధించింది. కేవలం నెలన్నర వ్యవధిలో 100 మిలియన్ వ్యూస్ సంపాదించడం అంటే మాములు విషయం కాదు. కేవలం 45 రోజుల్లోనే ఇన్ని వ్యూస్ సంపాదిస్తే ముందు ముందు యూట్యూబ్‌లో ఈ సినిమా ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి.

Related posts