చాలా కాలంగా డ్రగ్స్ కేసు సినీ పరిశ్రమలో కలకలం రేపుతుంది. ఈ కేసు పై ఎప్పటికప్పుడు ఉత్కంఠ రేపుతూనే ఉండగా తాజాగా మరోసారి సంచలనంగా మారింది. ఈ కేసులో ఈడీ రంగంలోకి దిగి డ్రగ్స్‌తో సంబంధం ఉన్న12 మందికి నోటీసులు జారీ చేసింది.
అయితే ఈ డ్రగ్స్ కేసులో నిందితురాలిగా ఉన్న సంజనా అనారోగ్యంతో బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరినట్లు ఆమె తల్లీ రేష్మా గల్రాని తెలిపారు. అన్నింటికీ తలరాత బాగుండాలి, అయితే మేం ఎలాంటి తప్పు చేయలేదని వెల్లడించారు. పేదలకు రోజూ అన్నదానం చేస్తున్నాం అని అన్నారు. సంజన అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరినట్లు తెలిపారు.
తాము డ్రగ్స్ సేవించినట్లు సీసీబీ పోలీసులు చార్జిషీటులో పేర్కొనడంపై శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసులో మరో నిందితురాలు, అందాల నటి రాగిణి ద్వివేది స్పందించారు. దేవుడు వేసిన ప్లాన్‌పై మనకు భరోసా ఉండాలి. అనుకున్నట్లు నడవకపోయినా కోపం ఉండకూడదు. ఆత్మవిశ్వాసం ఉంటేనే గెలవడం సాధ్యం అని ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసింది. ఇంటికే పరిమితమైన రాగిణి మీడియాతో మాట్లాడడానికి నిరాకరించారు. ఈ కేసులో ఏం చేయాలనేదానిపై లాయర్‌తో సంప్రదిస్తున్నారు.
కాగా ఇటీవల రాగిణి, సంజనా గల్రానిలు డ్రగ్స్ సేవించినట్టు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఇచ్చింది. 2020 అక్టోబర్ లో ఇద్దరి వెంట్రుక నమూనాలను బెంగుళూరు పోలీసులు ఎఫ్ఎస్ఎల్ కు పంపగా.. వాటిని పరీక్షించిన తర్వాత ఇద్దరు డ్రగ్స్ సేవించినట్టు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ లో పేర్కొంది. దీంతో ఈ కేసు ఇప్పుడు కీలకంగా మారింది. ఇంతలోనే సంజన ఆప్పత్రిలో చేరడం పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి.