telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

వైష్ణవ్ తేజ్ మూడో సినిమా రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

ఉప్పెన భారీ హిట్ అయ్యింది. అలాగే ఉప్పెన సినిమా మూడు రోజుల్లో రూ.50కోట్ల వసూళ్లను రాబట్టింది. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తన తొలి చిత్రంతోనే అందరినీ ఆకట్టుకున్నారు. ఉప్పెన సినిమాతో మంచి నటుడిగా గుర్తింపు పొందిన వైష్ణవ్ ప్రస్తుతం తన తదుపరి చిత్రంతో బిజీగా ఉన్నారు. వైష్ణవ్ తేజ్ తన రెండో సినిమాని స్టార్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో చేస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం వైష్ణవ్ తేజ్ మరో సినిమాకి గ్రీన్ సిగ్న ఇచ్చాడట. అయితే ఈ సినిమాకు దర్శకుడు ఎవరు అనేది తెలియదు కానీ.. ప్రొడ్యూసర్ మాత్రం ఓకే అయ్యాడంట. టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున వైష్ణవ్ తేజ్ మూడో సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవరించనున్నాడు. అంతేకాదు.. వైష్ణవ్ కి మూడో సినిమాకే 3 కోట్ల రెమ్యూనరేషన్ కూడా నాగ్ ఇస్తున్నట్లు టాక్ నడుస్తుంది. కానీ ఇందులో ఎంత నిజం ఉందొ తెలియదు. ప్రస్తుతం వైష్ణవ్ రెండో సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ముగించుకొని విడుదలకు సిద్దంగా ఉంది. వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా ప్రభావం రెండో సినిమాపై కూడా బాగా చూపిస్తోంది. వైష్ణవ్, క్రిష్ కాంబోలో వస్తున్న సినిమాపై భారీ అంచానాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా కూడా హిట్ అయితే అతని రెమ్యూనరేషన్ మరింత పెరిగే అవకాశం ఉంది. మరి వైష్ణవ్ తన రెండో సినిమాతో కూడా అభిమానులను అనుకున్న స్థాయిలో అలరిస్తారేమో వేచి చూడలి.

Related posts