telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పూరీ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ ?

huge security at salman khan house

స‌ల్మాన్‌ఖాన్, ప్ర‌భుదేవా కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం “దబాంగ్-3”. స‌ల్మాన్ ఖాన్‌, అర్బాజ్‌ఖాన్‌, నిఖిల్ ద్వివేది ఈ చిత్రాన్ని నిర్మించారు. డిసెంబ‌ర్ 20న ఈ సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ సినిమా ట్రైల‌ర్‌ను ఇటీవలే విడుదల చేశారు. తొలి రెండు పార్టుల్లో స‌ల్మాన్ స‌ర‌స‌న న‌టించిన సోనాక్షి సిన్హానే ఈ చిత్రంలోనూ స‌ల్మాన్ భార్య‌గా న‌టించారు. అయితే స‌ల్మాన్ ఫ్లాష్ బ్యాక్‌లో మాత్రం ఓ ల‌వ్‌స్టోరీ ఉన్న‌ట్లు ట్రైల‌ర్ చూపించారు. ఈ ట్రైల‌ర్‌లో మ‌హేశ్ మంజ్రేక‌ర్ త‌న‌య స‌యీ మంజ్రేక‌ర్ ప్రేయ‌సిగా న‌టించింది. తొలి రెండు భాగాల్లో స‌ల్మాన్ తండ్రిగా న‌టించిన వినోద్ ఖ‌న్నా క‌న్నుమూయ‌డంతో ఆయ‌న స్థానంలో ప్ర‌మోద్ ఖ‌న్నా న‌టించారు. డింపుల్ క‌పాడియా స‌ల్మాన్ త‌ల్లిగా న‌టించారు. ద‌బంగ్‌లో సోనూసూద్‌, దబాంగ్-2లో ప్రకాశ్ రాజ్ విల‌న్స్‌గా న‌టించ‌గా దబాంగ్-3లో క‌న్న‌డ స్టార కిచ్చా సుదీప్ విల‌న్‌గా న‌టించారు. ప్ర‌స్తావించాల్సిన విష‌య‌మేమంటే ఈ చిత్రంతో తొలిసారి స‌ల్మాన్ ద‌క్షిణాది ప్రేక్ష‌కుల‌ను కూడా ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఇక ‘దబాంగ్-3’ ప్రమోషన్ కోసం హైదరాబాద్‌ వచ్చిన సల్మాన్… పూరీ ఒకే అంటే సినిమా చేసేందుకు రెడీగా ఉన్నట్లు స్పష్టం చేశారు. పూరీ జగన్నాథ్‌తో సినిమా కోసం చాలా ఆసక్తిగా ఉన్నట్లు ఆయన తెలిపారు. ప్రభుదేవా, తాను త్వరలో పూరీ జగన్నాథ్‌ని కలుస్తామన్నారు. అన్ని కుదిరితే పూరీతో సినిమా ఉంటుందని సల్మాన్ పేర్కొన్నారు. కాగా పూరీ జగన్నాథ్ తెలుగులో తెరకెక్కించిన ‘పోకిరి’ సినిమా హిందీ రిమేక్‌ ‘వాంటెడ్’లో సల్మాన్ ఖాన్ నటించారు. అప్పటి నుంచి పూరీ జగన్నాథ్ తీసిన ప్రతి సినిమాపై సల్మాన్ ఖాన్ దృష్టి పెడుతున్నారు. పూరీ డైరెక్షన్‌లోనే పని చేసేందుకు తాను ఆతృతగా ఉన్నట్లు తాజాగా స్పష్టం చేశారు. మరి సల్మాన్‌తో సినిమాపై పూరీ జగన్నాథ్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Related posts