telugu navyamedia
సినిమా వార్తలు

భీమ్లా నాయక్ మాస్ డైలాగ్ లీక్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా దగ్గుబాటిలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ”భీమ్లా నాయక్” . యువ దర్శకుడు సాగర్ కే చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇటీవ‌ల విడుద‌లైన భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ యూట్యూబ్ ని షేక్ చేసిన విషయం తెలిసిందే.

Vedalam's Telugu remake to star Pawan Kalyan - Hindustan Times

తాజాగా ఈ సినిమా నుంచి మాస్ డైలాగ్ చెప్పే ఓ సీన్ లీక్ అయినట్లు తెలుస్తోంది. ఈ మధ్య ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ పెద్ద పెద్ద సినిమాల ముఖ్యమైన సీన్లు, డైలాగులు లీకవుతూనే ఉన్నాయి. వకీల్ సాబ్ షూటింగ్ సమయంలో కూడా ఫొటోలు, వీడియోలు లీక్ అయ్యాయి. ఇప్పుడు మరో పవర్ ఫుల్ మాస్ డైలాగ్ లీక్ అయిందట.

ఇప్పటికే రానా టీజర్ రెడీ చేశారట. త్వరలోనే దాన్ని రిలీజ్ చేసేందుకు దర్శకుడు ఏర్పాట్లు చేస్తున్నాడట. అయితే.. ఎప్పుడు ముహూర్తం పెట్టార‌నే దానిపై క్లారిటీ లేదు. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ సరసన నిత్యా మీనన్ నటిస్తుండగా.. రానా జోడీగా ఐశ్వర్య రాజేష్ నటిస్తోంది.

సంక్రాంతి బరిలో జనవరి 12న ఈ మూవీ విడుదల కానుంది.ఇక ఈ చిత్రానికి త్రివిక్రమ్ మాటలు అందిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్‌పై నాగవంశీ నిర్మిస్తున్నారు. భీమ్లానాయక్ సినిమా కోసం అటు పవన్ ఫ్యాన్స్, ఇటు రానా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Related posts