telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

హార్ధిక్ ఎంగేజ్మెంట్ పై మాజీ ప్రేయసి కామెంట్స్

Urvasi

స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్య అభిమానులకు అదిరిపోయే న్యూ ఇయర్‌ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. పాండ్య ఎప్పుడెప్పుడు ఓ ఇంటివాడు అవుతాడా అని తెగ ఎదురు చూసిన ఫ్యాన్స్ కోరిక నెరవేరుస్తూ బాలీవుడ్ నటి నటాషా స్టాన్‌కోవిచ్‌ను నిశ్చితార్థం చేసుకున్నాడు. ఎప్పటినుంచో వీరిద్దరి గురించి రూమర్స్ వస్తున్నా కూడా పాండ్య స్పందించలేదు. నటాషా సర్బియాకు చెందిన నటి. ‘డీజే వాలే బాబు’ అనే పాటలో నటించి ఇండియాలో బాగా పాపులర్ అయింది. త్వరలోనే వీరు పెళ్లి పీటలు ఎక్కనున్నారు. ఈ విషయాన్ని హార్దిక్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే. దీంతో పలువురు సినీ ప్రముఖులు, టీమిండియా క్రికెటర్లు సోషల్ మీడియా ద్వారా పాండ్యాకు శుభాకాంక్షలు తెలియజేశారు. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశీ రౌతేలా కూడా హార్దిక్‌కు విషెస్ చెప్పింది. ఊర్వశితో హార్దిక్ కొద్దికాలం డేటింగ్ చేశాడని గుసగుసలు వినిపించాయి. “మీ జంటకు నా ప్రత్యేక శుభాకాంక్షలు. మీ బంధం ఎప్పుడూ ప్రేమతో, ఆనందంతో ఉండాలని కోరుకుంటున్నాను” అని ఊర్వశి కామెంట్ చేసింది.

Related posts