telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

మరో దారుణం : సింగర్‌పై గ్యాంగ్‌ రేప్‌..! ఎమ్మెల్యేపై కేసు

rape

ఓ సింగర్‌పై గ్యాంగ్ రేప్ జరిగింది.. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు ఓ ఎమ్మెల్యే.. అయితే, సదరు గాయనిపై అఘాయిత్యం తర్వాత ఎమ్మెల్యే భయపెట్టడం, అంతేకాదు.. సదరు సింగర్‌కు సంబంధించిన వీడియోలు కూడా అతడి దగ్గర ఉండడంతో ఆ మహిళ ఇంతకాలం పోలీసులకు ఫిర్యాదు చేసేందుకే వణికిపోయింది.. కానీ, మరోకేసులో ఇప్పుడు అరెస్ట్ కావడంతో.. ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించింది.. దీంతో ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నిషాద్ పార్టీ ఎమ్మెల్యే విజయ మిశ్రా, అతని కుమారుడు.. 25 ఏళ్ల సింగర్‌పై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు ఉత్తరప్రదేశ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆరేళ్ల క్రితం.. అంటే 2014లో తన ఇంట్లో ఓ ప్రోగ్రామ్‌ ఉందంటూ ఇంటికి పిలిచిన ఎమ్మెల్యే మిశ్రా తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని.. విషయం ఎవ్వరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడని పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు. తనపై ఎమ్మెల్యే మిశ్రా అత్యాచారం చేసిన తర్వాత ఇంట్లో వదిలివేయాలని తన కొడుకు, మేనల్లుడికి చెప్పగా.. ఆ ఇద్దరు కూడా తనపై అత్యాచారం చేశారని బాధితురాలు పేర్కొంది. అయితే, తాజాగా భూ కబ్జా కేసులో ఎమ్మెల్యే మిశ్రా అరెస్ట్ అయ్యాడు.. ప్రస్తుతం ఆగ్రా జైలులో ఉన్నాడు.. సదరు ఎమ్మెల్యే దగ్గర తన వీడియో క్లిప్ కూడా ఉండడం, భయంతో ఇంతకాలం ఫిర్యాదు చేయలేకపోయానని.. ప్రస్తుతం అతను అరెస్టై.. జైలులో ఉండడంతో.. ఇప్పుడు ఫిర్యాదు చేస్తున్నట్టు పేర్కొన్నారు. కాగా, బీజేపీ మిత్రపక్షమైన నిర్బల్ ఇండియన్ షోషిత్ హమారా ఆమ్ దళ్ పార్టీకి చెందిన మిశ్రాపై పలు కేసులున్నాయి. భూ కబ్జాలు, బెదిరింపులు, తదితర కేసులు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు.

Related posts