telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

మన అమరావతి పై .. చంద్రబాబు బ్లూ ప్రింట్ ..

another 7 five star hotels in amaravati

ఎన్నికల సందర్భంగా కొత్త పథకాలు అనేకం ప్రవేశపెట్టబడుతున్నాయి. అన్ని పార్టీలు ఓటింగ్ లోగా ప్రజల మనసులు గెలుచుకునేందుకు తమ వంతు కృషి తాము చేసుకుంటూ పోతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రధాన పార్టీల మధ్య పోటీ గట్టిగానే ఉంది. ఈసారి కూడా ఓట్ల లెక్కింపు అనంతరం తప్ప గెలుపు పలానా వారిది అని సర్వే లు కూడా స్పష్టంగా చెప్పలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలు తమకు ఉన్న అవకాశాలు ఒక్కటి కూడా వదులుకోకుండా ప్రజలకు దగ్గర అవడానికి తీవ్రంగా పనిచేస్తున్నాయి. అయితే ఇదంతా ఎన్నికల వరకే అయినప్పటికీ, ఏదో ఒకటి చేసి ప్రజలను మెప్పించడం వారికి తప్పని పరిస్థితి.

ఏపీలో రాజధాని గురించి తాజాగా సీఎం చంద్రబాబు ఒక నివేదిక విడుదల చేశారు. దీనిలో రాజధాని ఎలా ఉండబోతున్నదే తెలిపారు. మీరు ఆ సినిమా ఒక సారి చూడండి. ఎప్పుడు చూసేదే అయినప్పటికీ, మరోసారి పూర్తిగా చూసేయండి. నచ్చుతుంది.. అయితే అదంతా కార్యరూపం దాలిస్తేనే.. ఇలా పేపర్ మీద మాత్రమే ఉంటె.. కలగానే మిగులుతుంది. ఏమవుతుందో ఎన్నికల ఫలితాల అనంతరం..కాదు మరో 10 ఏళ్లకు మాత్రమే తెలుస్తుంది. ఇంకా ఎక్కువ సమయం కూడా పట్టొచ్చేమో.. ! అభివృద్ధి చెందుతూ ఉన్న భారతదేశం లా ఉంటుందేమో.. ఏపీ రాజధాని కూడా.. అంటే ఎన్నటికీ పూర్తికాకుండా.. ! శుభం పలకమన్నారండి.. కాస్త ఆ దిశగా ఆలోచిద్దాం.. వీలైనంత త్వరగా పూర్తవుతుందేమో.

 

https://drive.google.com/open?id=14htWi-LHtgYKZ9BTDaBRHH-ogBiRI2nE

Related posts