telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

సీఏఏపై మా వైఖరి స్పష్టంగా ప్రకటించాం: సజ్జల

sajjala

పార్లమెంట్‌లో సీఏఏ బిల్లుకు మద్దతు ఇచ్చినప్పుడు మా వైఖరి స్పష్టంగా ప్రకటించామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. సీఏఏ విషయంలో అవసరమైతే అసెంబ్లీలో తీర్మానం చేయడానికి కూడా సిద్ధమేనని సజ్జల ప్రకటించారు. పార్లమెంట్‌లో సీఏఏకి వైసీపీ మద్దతు ఇచ్చినప్పుడు ఎన్‌పీఆర్, ఎన్‌ఆర్సీలు లేవని తెలిపారు.

దేశ భద్రత, చొరబాట్లు, అక్రమ వలసల నిరోధం విషయంలోనే సీఏఏ బిల్లుకు వైసీపీ మద్దతు ఇచ్చిందని సజ్జల వివరించారు. ఆ తర్వాత కాలంలో ఎన్‌ఆర్సీ అంశం వచ్చిందని వెల్లడించారు. ముస్లిం మైనార్టీల ఆందోళన విషయంలో ప్రభుత్వం పూర్తి అవగాహనతో ఉందని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం ఉండగా వారికి ఎలాంటి ఇబ్బందులు రానివ్వమని హామీ ఇచ్చారు.

Related posts