telugu navyamedia
సినిమా వార్తలు

విజే, నటుడు ఆనంద కణ్ణన్‌ మృతి

సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ కోలీవుడ్ నటుడు ఆనంద కణ్ణన్ కాన్సర్ కారణంగా ఆగష్టు 16న (సోమవారం) కన్నుమూసారు. దీంతో తమిళ సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయనకు 48 సంత్సరాలు. సింగపూర్‌లో వసంతం టీవీ ద్వారా వీడియో జాకీ (వీజే) గా కెరీర్ ప్రారంభించిన ఆయన.. ఆ తర్వాత సన్ మ్యూజిక్‌తో పాటు సన్ టీవీ సీరియల్స్‌తో తమిళ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అంతేకాదు ‘సరోజ’, ‘అదిసయ ఉల్లం’ చిత్రాల్లో నటించారు. మరికొన్ని చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. తమిళ టీవీ తెరపై యూత్ ఐకాన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

ఆయన మృతిపై తమిళ సినీ, టీవీ వర్గాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. దాదాపు 30 ఏళ్ల పాటు పాటు ఆయన సినీ రంగానికి సేవలందించారు. ఆయన ఏకేటీ థియేటర్స్‌ను ఏర్పాటుచేసి.. వర్క్‌షాప్స్‌తో రూరల్‌ కల్చర్‌ ద్వారా వర‍్ధమాన నటులెందరినో ప్రోత్సహించాడు. సింగపూర్‌లోని వసంతం టీవీలో వీజేగా కెరీర్ ఆరంభించిన ఆనంద కణ్ణన్ ఆ తర్వాత చెన్నైలో స్థిరపడ్డాడు. సన్ మ్యూజిక్ ప్రారంభించిన తర్వాత ఛానెల్‌లో సీరియల్స్ చేశారు.

Related posts