telugu navyamedia
సినిమా వార్తలు

పునీత్ ఫ్యామిలీకి రామ్ చ‌ర‌ణ్ ప‌రామ‌ర్శ‌..

లక్షలాది మంది అభిమానుల మనస్సులో చెరగని ముద్ర వేసుకున్న కన్నడ పవర్​స్టార్ పునీత్ రాజ్​కుమార్ అకస్మాత్తుగా గుండెపోటురావడంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. పునీత్ మరణ వార్త విని అభిమానుల నుంచి సెలబ్రిటీల వరకు ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు . చిన్న వయసులోనే ఎంతో పేరుసంపాదించుకున్న పునీత్ హఠాత్మరణంతో కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్ లోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఈ నేపథ్యంలోనే పలువురు ప్రముఖులు బెంగళూరులోని పునీత్​ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబసభ్యులను, అన్న శివరాజ్​కుమార్​ను పరామర్శిస్తున్నారు..

తాజాగా..మెగా ప‌వ‌ర్‌స్టార్‌ రామ్​చరణ్ పునీత్ రాజ్​కుమార్ ఫ్యామిలీని పరామర్శించారు​. పునీత్ మరణం పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆ త‌రువాత మీడియాతో మాట్లాడుతూ..అప్పు లేరనే విషయాన్ని నమ్మలేకపోతున్నానని , ఇది అస‌లు జ‌రిగిందా లేదా అన్న‌ది మాకు అర్ధం కావ‌డం లేద‌ని క‌న్నీళ్లు పెట్టుకున్నారు రామ్‌చ‌ర‌ణ్‌. తాను కలిసిన వ్యక్తులలో పునీత్​ ఓ గొప్ప మనిషని కొనియాడారు. .

krfadharwad™ on Twitter: "Wishing Mega Power Star @AlwaysRamCharan sir a  very Happy Birthday on behalf of #powerstar @PuneethRajkumar Fans 🥰🥰❤️❤️  Best Wishes for #RRRMovie 🕺🕺 #HBDRamCharan #HappyBirthdayRamcharan  #RamCharan #puneethrajkumar ...

సొంత ఫ్యామిలీలో నెంబ‌ర్ పోతే ఎంత బాధ ఉంటుందో అంత బాధ‌గా ఉంది..నాకు మాట‌లు కూడా రావ‌డం లేద‌ని ఆవేద‌న చెందారు. మా ఇంటికి వ‌చ్చి మ‌మ్మ‌ల్నే గెస్ట్ లాగా ఫీల్ అయ్యేలా చేసేవాడు.. అంత మంచి వ్య‌క్తి అని, ఏదైనా నేర్చుకోవాలంటే ఆయ‌న ద‌గ్గ‌ర‌నుంచి నేర్చుకోవాలని బాధ ప‌డ్డారు. మిస్ యూ పునీత్‌గారు..ల‌వ్ యూ అని క‌న్నీట‌ప‌ర్యంత‌మ‌య్యారు.

Related posts