telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

భావోద్వేగంతో చిరు, చరణ్… “సైరా” విజయంతో సంతోషంలో మెగా ఫ్యామిలీ

Chirnajeevi

“ఖైదీ నెంబర్ 150″తో రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి… ఆ సినిమాతో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకుని తనకు ఇంకా ఏమాత్రం క్రేజ్ తగ్గలేదని నిరూపించుకున్నారు. ఇక ఆ సినిమా ఇచ్చిన జోష్ తో తన కలల ప్రాజెక్ట్ “సైరా”ను తనయుడు రామ్ చరణ్ నిర్మాతగా పట్టాలెక్కించాడు చిరు. ఈ సినిమా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా అమితాబ్‌, కిచ్చా సుదీప్‌, విజయ్‌ సేతుపతి, జగపతి బాబు, అనుష్క, తమన్నా, నయనతార లాంటి భారీ తారాగణంతో రూపొందించారు. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాను అన్ని ప్రాంతీయ భాషలలో విడుదల చేస్తున్నారు. మెగా అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. వివాదాల మధ్య ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 4620 థియేటర్లలో సైరా విడుదలైంది. సైరా విడుదల నేపథ్యంలో ట్విట్టర్‌లో ఇప్పటికే పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. చిరు అభిమానులు బొమ్మ బ్లాక్ బస్టర్ అంటూ ట్విట్టర్‌ను హోరెత్తిస్తున్నారు. ఓవర్‌సీస్ రివ్యూలు కూడా పాజిటివ్‌గా ఉండటం.. చిరు నటన అద్భుతంగా ఉందన్న ప్రశంసలు వినిపిస్తుండటంతో.. సైరాటీం అంతా సంతోషంలో మునిగి తేలిపోతుంది. ఇక చిరంజీవి, రామ్ చరణ్ సంతోషానికి అవధులు లేవు. “ఈ బాస్ బస్టర్ కు ధన్యవాదాలు నాన్నా” అని తన తండ్రికి థ్యాంక్స్ చెప్పాడు చెర్రీ. తన తండ్రి తనను గుండెలకు హత్తుకొని ముద్దాడుతున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. చిరంజీవి, రామ్ చరణ్ భావోద్వేగాలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చరణ్‌ను ఎంతో అప్యాయంగా చిరంజీవి హత్తుకున్న ఫోటోలు, ముద్దు పెట్టుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

Related posts