telugu navyamedia
సినిమా వార్తలు

కాలితో సల్మాన్ స్కెచ్ వేసిన అభిమాని… సల్మాన్ స్పందన ఏంటంటే…?

Salman-Khan

ప్రభుదేవా దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్లు సల్మాన్‌ఖాన్, సోనాక్షిసిన్హా హీరోహీరోయిన్లుగా “దబాంగ్-3” చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం చిత్రీకరణ చాలా రోజుల క్రితమే మొదలైంది. కానీ “భారత్” సినిమా షెడ్యూల్‌తో సల్మాన్ బిజీ అవ్వడంతో “దబాంగ్-3” షూటింగ్‌కు బ్రేక్ పడింది. తాజాగా “దబాంగ్-3” చిత్రం మళ్లీ సెట్స్ పైకి వెళ్ళింది. చివ‌రిగా భార‌త్ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన స‌ల్మాన్ ఇప్పుడు “దబాంగ్-3″తో బిజీగా ఉన్నాడు. ఇక ఈ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ కు భారీ క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. సల్మాన్ కు ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ ఉంది. స‌ల్మాన్ కొద్ది రోజులుగా చిత్రానికి సంబంధించిన ప‌లు విష‌యాల‌ని సోష‌ల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ అభిమానులను ఉత్సాహ ప‌రుస్తున్నారు. తాజాగా ఇరాన్‌కి చెందిన దివ్యాంగురాలికి సంబంధించిన ఓ వీడియోని షేర్ చేశాడు. ఆమె స‌ల్మాన్ వీరాభిమాని కాగా… త‌న కాలుతో స‌ల్మాన్ స్కెచ్ వేసింది. త‌న పాదాల‌తో వేసిన ఈ స్కెచ్ స‌ల్మాన్ హృద‌యాన్ని తాకింది. అభిమాని వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. “దేవుడు ఆశీర్వాదంతో పాటు మ‌రింత ప్రేమని పొందుతావు” అని కామెంట్ పెట్టాడు స‌ల్మాన్. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఈ వీడియోని ఇప్ప‌టి వ‌ర‌కు 2,504,329 మంది వీక్షించారు.

 

View this post on Instagram

 

God bless… can’t reciprocate the love but prayers and much love !!!

A post shared by Salman Khan (@beingsalmankhan) on

Related posts