టాలీవుడ్ ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే మెగా ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ, మంచు ఫ్యామిలీ నుంచి వారసులు ఎంట్రీ ఇవ్వడం, అందులో కొంతమంది ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం, మరికొంతమంది వెనకపడిపోవడం జరిగింది. ఇక ఇప్పుడు దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి మరో హీరో రాబోతున్నాడు. దగ్గుబాటి ఫ్యామిలీ హీరోలుగా వచ్చిన వెంకటేష్, రానా టాలీవుడ్‌లో అశేష ప్రేక్షకాదరణ పొందారు. ఇప్పుడు అదే ఫ్యామిలీ నుండి సురేష్ బాబు చిన్న కుమారుడు వస్తున్నాడు. సురేష్ బాబు చిన్న కుమారుడు, రానా సోదరుడు అభిరామ్ దగ్గుబాటి గతంలో లేడీస్ టైలర్‌కి సీక్వెల్‌గా తెరకెక్కిన చిత్రంలో నటించాడు. కాని అంతగా అలరించలేకపోయాడు. ప్రస్తుతం ఆయన ముంబైలోని యాక్టింగ్ స్కూల్‌లో శిక్షణ తీసుకుంటున్నాడట. డ్యాన్స్ , మార్షల్ ఆర్ట్స్, యాక్టింగ్ ఇలా అన్ని విభాగాలలో పూర్తి శిక్షణ తీసుకున్నాక వెండితెరపై హీరోగా కనిపించాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. దగ్గుబాటి హీరోలలో ఒకరైన వెంకటేష్ ప్రస్తుతం వెంకీమామ సినిమాతో బిజీగా ఉండగా, రానా విరాట పర్వం చిత్రంతో బిజీగా ఉన్నాడు.
previous post