telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“వైల్డ్ డాగ్” షూటింగ్ పూర్తి

Nag

మన్మథుడు సినిమా సీక్వెల్ మన్మథుడు2 సినిమాతో గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కింగ్ నాగార్జున. అయితే ఆ సినిమా అంత విజయం దక్కించుకోలేకపోయింది. ప్రస్తుతం అహిషోర్ సాల్మోన్ దర్శకత్వం లో వైల్డ్ డాగ్ సినిమాలో నటిస్తున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగార్జున ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ విజయ్ వర్మగా నటిస్తున్నారు. దియా మీర్జా – సయామి ఖేర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.నిజానికి ఈ సినిమా ఎప్పుడో మొదలైంది. ఈపాటికి రిలీజ్ కూడా అవ్వాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల లేట్ అయితే కరోనా వల్ల మరింత లేట్ అయింది . ఇప్పటికే మెజారిటీ భాగం షూటింగ్ జరుగునున్న ఈ చిత్రాన్ని కోవిడ్ నేపథ్యంలో ఇటీవలే తిరిగి ప్రారంభించారు. హిమాలయాల్లో సినిమా చివరి షడ్యూల్ ను షూట్ చేసారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ఈ విషయాన్నీ సోషల్ మీడియా ద్వారా తెలిపిన నాగ్ కొన్ని ఫోటోలను షేర్ చేశారు. నా టాలెంటెడ్ టీమ్ కు గుడ్ బై చెప్పాల్సిన సమయం వచ్చేసింది అంటూ పోస్ట్ చేశాడు నాగ్.

Related posts