telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

కరోనాకు ఆ ఒక్క టాబ్లెట్ చాలు… భారతీయ శాస్త్రవేత్త గగన్‌దీప్‌ కాంగ్‌

Gagan-Deep

గతకొద్ది రోజులుగా కరోనా వైరస్ (కోవిడ్ -19) ప్రపంచాన్ని వణికిస్తుంది. హైదరాబాద్లో కూడా కరోనా కేసులు నమోదు కావడంతో ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. కరోనా అనుమానితులతో ఆసుపత్రులు నిండిపోయాయి. అయితే కరోనా వైరస్ ను తట్టుకునే శక్తి భారతీయులకు ఉందంటున్నారు భారతీయ శాస్త్రవేత్త గగన్‌దీప్‌ కాంగ్‌. ప్రస్తుతం క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆమె.. గతంలో తన పరిశోధనలకు ఎన్నో అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు. ప్రఖ్యాత ‘రాయల్‌ సొసైటీ’ ఫెలోషిప్‌ పొందారు. నార్వే ఆధారంగా పనిచేస్తున్న అంటువ్యాధుల సన్నద్ధత కార్యక్రమం (సీఈపీఐ)కి ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. కోవిడ్‌-19ని తట్టుకునే సామర్థ్యం భారతీయులకు ఉందని ఆమె చెబుతున్నారు. ‘‘కరోనాకు భయపడాల్సిన అవసరం లేదు. ఈ వైరస్‌ సోకిన ప్రతి ఐదుగురిలో నలుగురికి ప్రత్యేక వైద్యం అవసరం లేకుండానే తగ్గిపోతుంది. అంతగా అవసరమైతే పారాసిటమాల్‌ వాడితే సరిపోతుంది. అది కూడా సాధారణ జలుబు, జ్వరానికి వాడినట్లే. మిగతా ఒక్కరి విషయంలోనే ఆందోళన. ఆ ఒక్క కేటగిరీలో వృద్ధులు ఉంటారు’’ అని చెబుతున్నారు. ‘‘కోవిడ్‌-19 వల్ల చిన్నారులకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే.. ఈ వైరస్‌ సోకి, జ్వరంతో శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిపడుతున్న వారు మాత్రమే ఆస్పత్రులకు వెళ్లాలి’’ అని పేర్కొన్నారు.

Related posts